
కాకి పిల్ల కాకికి ముద్దన్నరు. తీగకు కాయ బరువా ఏంది? ఎట్లున్న, ఎవరేమన్న.. తల్లికి బిడ్డే ముద్దు గద. కనీ, గీ పిల్ల ఆవు దూడ తన తల్లి అవుని ముద్దు జేసింది. అందరినీ ఆశీరపరచింది.
ఎట్లంటే, ఇగో ఆవుని కట్టేసిండ్లు. దాని దూడను వదిలి పెట్టిండ్లు. గా ఆవు ముందల మేతే లేదు. ఇగ గా ఆవు దూడ ఏమనుకున్నదో గనీ, గా పక్కనే ఎండబెట్టిన మక్కజొన్న కంకుల కెల్లి ఒక దాన్ని నోట కరుసుకుంది. ఇగ గదాన్ని తన తల్లి ఆవు దగ్గరికి తీసుకపోయింది. గా ఆవు తన లేగ తెచ్చిన కంకిని తిన్నది. వారెవ్వా తల్లి పేమనే సూత్తానం గనీ, గీ బిడ్డ పేమ గూడ అందరినీ ఆకట్టుకుంటాంది. మనుసుల మద్దెల పేమలు పోతానయి గనీ, ఇంకా పశువులు, పచ్చుల మద్దెల పేమలు ఎంత బాగున్నయి గదా! ఇగో అవ్వయ్యలకు కూడు పెట్టనోల్లూ గది సూసి నేర్సుకోండి.

