
పతి ఒక్కరి జీవితంల ఇల్లు, పెండ్లి అనేయి పెద్ద కలలు. ఎవలకైనా గయి చానా పెద్ద మలుపులు. గందుకే ఇల్లు కట్టి సూడు పెండ్లి సేసి సూడు అని పెద్దోళ్ళు ఉట్టిగనే అనలే. పెండ్లి ఖర్చైతే, ఇల్లు మద్దె తరగతోళ్లకి పెద్ద ఆశ! పెండ్లి గట్టిగ నిలవాలె. మరీ గా కట్టుకునే ఇల్లు గట్టిగనే ఉండాలె గదా. గట్టిగ ఉండాలంటే ఏం సేయాలె? ఎంత గట్టిగ ఇల్లు కట్టుకోవాల్నన్నా, గొడలు నెర్రెలు బాస్తనే ఉంటయి. ఇగ గా నెర్రెలు బాయకుండ గూడ ఇండ్లు కడ్తాండ్లు గా మేస్త్రీలు.
ఎట్లంటే, గా ఇండ్లకు ఏసే పిల్లర్ కు, గోడకు మద్దెల ఓ సలాక ను వంచుతరు. ఇగ కట్టే గా ఇటుకల గోడకు ఇంకొక సలాకను పిల్లర్లకి పైకి కిందికి పెట్టి మాల్ పోసి నింపుతున్నరు. గంతే, గోడకు పిల్లరుకు మధ్య అతికి నెర్రెలు రాకుండా ఉంటదట. ఎవ్వలైనా ఇల్లు కట్టుకునేటోల్లు గీ చిట్కాను సూడుండ్లి. మీ మేస్త్రికి సెప్పి మరీ జాగ్రత్త పడుండ్లి. ఎట్లున్నది గీ కిట్కు?

