
కార అంటే కమ్మగ తింటం గద. గదేనుల్ల మిక్చరో మిక్సరో అంటం గద. గా మందులోకి, గింత బువ్వలోకి..ఇగ ఎప్పుడన్న టిపిని లెక్క, కడుపాకలికి ఇంత బుక్కలెక్క బుక్కుతమా లేదా? ఇగో గది ఎట్ల సేత్తరో సూత్తే, సుక్క ముట్టరు, బుక్క కార నోట్లో బెట్టరు.? అమ్మతోడు! మీ మీదొట్టు!!
గా కారను ఎట్ట సేత్తాండ్రో తెలుసా? గా కారల పూసను ఒకపాలి సేసి రాసి పోసిండ్లు. గదాని మీద గా బూందీని, పప్పిత్తులను నూనెల ఏంచి పోసిండ్లు. ఇంత మాల్ మసాల సల్లిండ్లు. ఇగ రొండు సేతులల్ల రొండు తపుకులను పట్టుకున్నడు, ఇగొ గవాట్ని ఒంగబడి రెండు సేతులతోని కలుపుకుంట, తొక్కుకుంట పోతనే ఉన్నడు. గా కలుపుడైనంక, తొక్కుడైనంక, గదాన్ని పొట్లాలల్ల పోసి గాయింత యేడితోని ఒత్తుతడు. ఇగ గవి మనకు షాపులల్లకు ఒత్తయి. మనం పైసలు బెట్టి గా సేసెటోని తొక్కుల్ల బడ్డది కమ్మగ తింటున్నమన్నమాట. చూసిండ్లా ఎంత గలీజుది పైసలు పెట్టి తింటున్నమో? మనమైతే గట్లనే సేసుకుంటమా? తింటమా? సోచాయించుండ్లి?

