యేడాదికోపాలొచ్చే పండుగాయె. తీరొక్క పూలతో పాడి, ఆడే ఆటాయె. ఇగ గా వానదేవునికి కండ్లు కుట్టి, కుండపోత పోయబట్టె. ఇగ గిదంత పని గాదని, గా ఆడోళ్ళు ఏం చేసిండ్లో సూత్తె మీరు గూడ శభాష్ అంటరు.
గీ బతుకమ్మ పండుగొచ్చింది గద. తొమ్మది రోజులు తీరొక్క పూలతో బతకుమ్మలను పేర్చి, సూన్మ, పౌడర్, అత్తర్లతో మేకప్ యేసుకుని, మంచిగ తయారై ఆడుకుందామని సెరువు గట్టుకుపోతే ఒకటే వానాయె. వానొచ్చినా, పిడుగులు పడ్డా, మా ఆట మేమాడుకుంటం అనుకున్నరు గా ఆడోళ్ళు. గంతే మనిషొక్క ఛత్రిని పట్టుకున్నరు. బతుకమ్మలను ఆడ ఒక్కదగ్గర బెట్టిండ్లు. సుట్టూతా శేరి డాన్సులు చేసిండ్లు. ఇగ నువ్వా? నేనా? అన్నట్లు.. వాన పడ్తనే ఉంది. ఆట ఆడ్తనే ఉన్నరు. గది సూసినోళ్ళు. అబ్బో గీ ఆడోళ్ళు మామూలు మాసరగ లేరు. తగ్గేదే లే అని గా వానతోనే పోటీ పడుతుండ్లని అనుకుంటాండ్లు.

