వారెవ్వా! గీ యికమతు మస్తుగున్నది. నీళ్లల్ల ఉన్న శెత్తను నిమిషాల్లోనే సంచులకు ఎత్తుతున్నది. గా సంచులు గూడ గమ్మత్తుగ ఉన్నయి. ప్లాస్టిక్ బకీట్లకు కట్టెలు కట్టిండ్లు. గా బకీట్ల అడుగును తీసేశిండ్లు. ఇగ గా కింద శిన్న శిన్న పొక్కలు పొక్కలున్న సంచులు కట్టిండ్లు. గవాటితోని నీళ్ళ మీద తేలాడుతున్న తాగి పడేసిన ప్లాస్టిక్ సీసాలు, తేలిన చెత్తా చెదారాన్ని గా సంచుల్లోకి ఇగ్గిండ్లు. ఒట్టి సంచులతోనైతే గయి అటు ఇటు పోతయి గద. ఇగ గీ బకీట్లకు కట్టెలు గట్టిన సంచులతోనైతే గయన్నీ మెల్లంగ సంచుల్లోనె పడతానయి. ఒక్కొక్కటిగా సంచుల్లకు తోడినంక… మెల్లగ దాన్ని పైకి లేపిండ్లు. పొక్కలున్న సంచులాయె. ఒక్క సుక్క గూడ లేకుండ గా నీళ్లన్ని కారిపోయినయి. ఇగ గిట్లనే గాదు, నీళ్ళల్ల లోపలికి పడవల్లో పోయి గూడ గీ శెత్తని ఎత్తేసిండ్లు. గంతేనా, గా సంచులకు మూతి సుట్టూ పరదలు కట్టి గూడ నీళ్లల్ల శెత్తను తీసేటందుకు ఇంగోరకగం సంచులు తయారు జేసిండ్లు. గిదేదో బాగుంది గదా? గీ ఇకమతును అరవపోళ్ళ రాస్ట్రం లేదా గదేనుల్ల…తమిళనాడుల తిరుసురాపల్లెల ఉండే ఓ పెద్ద బడి సారు, ముత్తు కుమరన్ అనేటాయిన గీ సంచులను తయారు జేశిండు. ముదరస్ మ్యాజిక్ బ్యాగులని పేరు పెట్టిండు. గా సారు గాడికే ఊకోలే. గా సంచులని గా మొన్న ప్రయాగ్ రాజ్ ల జరిగిన కుంబమేలాకి గూడ పంపించిండంట.
గి దీనికే ఆశీరపోకుండ్లి. గ సారు దగ్గర సముద్రంల శెత్తను ఎత్తి, నీటిని తేటగ జేశే కిట్కులు గూడా ఉన్నయట. మనం శెత్తెత్తాంటే, గ సారు ఇకమతులు జేస్తాంటే ఏం బాగుంటది శెప్పుండ్లి? మీకో దండం ఉల్ల. యేడికిపోయినా సరే, యేడబడితే గాడ గా శెత్తను ఏయకుండ్లి. ఇంటుండ్లా!?
నీళ్ళను తేటగ జేశే ఇకమతు!?|ADUGU TRENDS

