ఉత్తరాఖండ్ లో గత కొన్ని రోజులుగా మంచు కురుస్తుండటంతో భారీగా మంచు చరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. వాటిని తొలగించే పనులు నిర్వర్తిస్తున్న కార్మికుల్లో 55 మంది అనూహ్యంగా వాటికింద చిక్కుకుపోయారు. ఇప్పటికే 33 మందిని రక్షించగా, వారిలో తాజాగా మరో 14 మందిని ఆర్మీ రక్షించింది. ఇంకా 8 మంది చిక్కుకొని ఉన్నారు. ఏడు అడుగుల లోతైన మంచులో కూరుకుపోయిన వారిని బయటకు తీసేందుకు ఆర్మీ తీవ్రంగా శ్రమిస్తోంది.

