పీఎం కిసాన్ 19వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం రేపు రైతుల ఖాతాల్లో జమచేయనుంది. బిహార్ లోని భాగల్పూర్ లో జరిగే సభలో ప్రధాని నరేంద్ర మోడీ నిధులు విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా దేశంలోని 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.22 వేల కోట్లు జమ చేయనున్నారు. కాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 70 లక్షలకుపైగా రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. రూ.1,460 కోట్లకుపైగా నిధులు విడుదల కానున్నాయి.

