Sonia Gandhi: రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఢిల్లీలో సర్ గంగా రామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గురువారం ఆమె అస్వస్థతకు గురయ్యారు.
దీంతో నిన్న ఉదయం ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యంతో గురువారం ఉదయం ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఆరోగ్యం కుదుటపడుతుంతో శుక్రవారం మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశారు. గతేడాది డిసెంబర్‌లో సోనియా 78 వ వసంతంలోకి అడుగుపెట్టారు.
Sonia Gandhi: ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్

