అదనపు కట్నం ఇవ్వలేదని హెచ్‌ఐవీ ఇంజెక్షన్
అదనపు కట్నం చెల్లించలేదనే నెపంతో, కోపంగా అత్తింటివారు తమ కూతురికి హెచ్ఐవీ ఇన్ఫెక్టెడ్ ఇంజెక్షన్ను ఇచ్చారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. విషయంలోకి వెళ్తే ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ ప్రాంతానికి చెందిన అభిషేక్ అలియాస్ సచిన్ కు సోనాల్ సైనీని ఇచ్చి 2023లో పెళ్లి జరిపించి ఓ కారు, రూ.15 లక్షల నగదు వరునికి కట్నంగా ఇచ్చారు. కొంత కాలం తర్వాత స్కార్పియో కారు, రూ.25 లక్షలు కట్నంగా ఇవ్వాలని అత్తింటివారు డిమాండ్ చేశారు. అందుకు సోనాల్ తండ్రి అంగీకరించలేదు. దీంతో అభిషేక్ బంధువులు సోనాల్కు హెచ్ఐవీ ఇన్ఫెక్టెడ్ ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. వైద్య పరీక్షల్లో ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. ఆమె భర్త అభిషేక్ కు హెచ్ఐవీ నెగెటివ్ అని తెలిసింది. వెంటనే భయపడ్డ సోనాల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదు. దాంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు గంగోహ్ కొత్వాలి పోలీసులు సోనాల్ పై దాడి, హత్యాయత్నం, వరకట్న వేధింపులకు పాల్పడినట్లు అభిషేక్ తోపాటు అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.

