బీజేపీ ఎమ్మెల్యే, తెలంగాణ అసెంబ్లీలో చీఫ్ విప్‌గా ఉన్న పాల్వాయి హరీష్ బాబు ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో అవమానానికి గురయ్యారని ఆరోపించారు. కేంద్ర మంత్రితో సమావేశం ఉండటంతో రాత్రి భవన్‌కు వచ్చారు కానీ, రిసెప్షన్‌లో ఉన్న సిబ్బంది దురుసుగా వ్యవహరించి రూమ్ లేదని, ప్రైవేట్ హోటల్‌కు వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. రెసిడెంట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన ఆయన, రూముల కేటాయింపుల్లో మాఫియా ఉందని, ప్రజాప్రతినిధులకు వసతి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. జరిగిన అవమానం గురించి అసెంబ్లీలో స్పీకర్‌కు ఫిర్యాదు చేసి, ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెడతానని స్పష్టం చేశారు.

