ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మద్యం విధానం కారణంగా కేజ్రీవాల్ ప్రతిష్ఠకు తీవ్ర దెబ్బతగిలిందని, మద్యం దుకాణాలను ప్రోత్సహించడం ప్రజాస్వామిక విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. దిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాభవం చవిచూడటంపై స్పందించిన ఆయన, ప్రజలకు సేవ చేయాలనే ప్రాథమిక సూత్రాన్ని కేజ్రీవాల్ మర్చిపోయారని అన్నారు. జన లోక్‌పాల్ ఉద్యమం నుంచి రాజకీయం వరకు వచ్చిన కేజ్రీవాల్, తప్పుడు విధానాలతో ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని హజారే ఆక్షేపించారు. శీష్‌మహల్ వంటి వివాదాలు కూడా ఈ పరాజయానికి కారణమయ్యాయని అభిప్రాయపడ్డారు.

