పెళ్లి సంబంధాలు కుదిరే విధానం కాలానుగుణంగా మారుతోంది. ఒకప్పుడు కుటుంబ నేపథ్యం, గుణగణాలు, ఆస్తిపాస్తులు ప్రధానంగా పరిగణించేవారు. కానీ మహారాష్ట్రలో జరిగిన ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు పెళ్లి సంబంధాల్లో కొత్త ప్రమాణాలు పెట్టింది. వరుడి సిబిల్ స్కోర్ తక్కువగా ఉందన్న కారణంతో వధువు కుటుంబం వివాహాన్ని రద్దు చేసింది.
మహారాష్ట్ర మూర్తాజాపుర్ ప్రాంతానికి చెందిన వధువుకు అదే ప్రాంతానికి చెందిన వరుడితో వివాహం కుదిరింది. ఇరు కుటుంబాల సభ్యులు కలిసి ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్న సమయంలో, వధువు అంకుల్ వరుడి సిబిల్ స్కోర్ చెక్ చేయాలని కోరాడు.
సిబిల్ స్కోర్ చూడగానే ఆయన షాక్ అయ్యాడు! వరుడు ఇప్పటికే అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాడని, సిబిల్ స్కోర్ చాలా తక్కువగా ఉందని గుర్తించాడు. దీంతో ఆర్థిక భరోసా లేకపోవడంతో పెళ్లిని రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

