అక్కినేని కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు ప్రధానికి ప్రత్యేకంగా అక్కినేని నాగేశ్వర్ రావు జీవితంపై రూపొందించిన పుస్తకాన్ని బహూకరించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ రాజకీయంగా, సినీ రంగంలో చర్చనీయాంశంగా మారింది. అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, ఇతర కుటుంబ సభ్యులు, టీడీఎల్పీ పార్లమెంటరీ నేత లావు కృష్ణ దేవరాయలు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ కూడా వారితో స్నేహపూర్వకంగా మాట్లాడినట్లు సమాచారం. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కినేని కుటుంబం మోదీని ఎందుకు కలిశారు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

