శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. “అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర, జ్యోతిర్లింగ దర్శనం” పేరుతో భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ట్రిప్ వివరాలు:
ఈ రైలు ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం 718 సీట్లు ఉన్నాయి:
- స్లీపర్ క్లాస్: 460
- 3ఏసీ: 206
- 2ఏసీ: 52
ఏపీలో హాల్ట్ స్టేషన్లు:
ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం, ఏపీలోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పలాస స్టేషన్లలో హాల్ట్ ఉంటుంది.
యాత్రలో సందర్శించగల పుణ్యక్షేత్రాలు:
గయ: విష్ణుపాద ఆలయం
వారణాసి: కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షి దేవాలయం, అన్నపూర్ణ దేవి ఆలయం
అయోధ్య: శ్రీ రామ మందిరం, హనుమాన్ గర్హి, సరయూ నది హారతి
ప్రయాగ్‌రాజ్: త్రివేణి సంగమం, మహా కుంభమేళా పుణ్యస్నానం
ప్యాకేజీ ఛార్జీలు (తలసరి):
- స్లీపర్ క్లాస్: ₹14,390 (పిల్లలకు ₹13,495)
- 3ఏసీ: ₹23,600 (పిల్లలకు ₹22,550)
- 2ఏసీ: ₹31,160 (పిల్లలకు ₹29,990)
భక్తుల ఆసక్తి కారణంగా భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్లకు భారీ స్పందన లభిస్తోంది. రైల్వే శాఖ ఈ రైళ్ల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

