2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) దోషిగా తేలి ముంబై అంథేరి కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. మహేశ్ చంద్ర అనే వ్యక్తి వర్మపై ఫిర్యాదు చేయగా, విచారణకు RGV ఒక్కసారి కూడా హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆగ్రహించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారునికి 3 నెలల్లో రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.

