తాను అమెరికా మోడల్‌నని చెప్పి 700 మంది అమ్మాయిలను మోసగించిన నోయిడాకు చెందిన తుషార్ (23) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తుషార్ డేటింగ్ యాప్స్, స్నాప్‌చాట్ వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రొఫైల్స్ తయారు చేసి, బ్రెజిల్ మోడల్ ఫొటోలను ఉపయోగించి యువతులను ఆకర్షించేవాడు. తరువాత వారి ఫొటోలు, వీడియోలు, ఫోన్ నంబర్లను సేకరించి బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బు వసూలు చేశాడు. ఒక బాధిత యువతి ఫిర్యాదు చేయడంతో అతని మోసం బయటపడింది. ఈ కేసు ద్వారా తుషార్ గతంలో అనేకమందిని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

