యూపీ బాగ్పట్‌లో స్కూల్ విద్యార్థినుల మధ్య రోడ్డుపైనే జరిగిన గొడవ స్థానికంగా ఆసక్తికర చర్చనీయాంశమైంది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న ఐదారుగురు విద్యార్థినులు ఒకే అబ్బాయిని ప్రేమిస్తున్నట్లు చెప్పుకోవడంతో వివాదం మొదలైంది. “మై బాయ్‌ఫ్రెండ్” అంటూ ఒకరిపై ఒకరు దాడి చేయడం ప్రారంభించారు. రోడ్డు మీదే దారుణంగా కొట్టుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు వారిని ఆపేందుకు ప్రయత్నించినా వారి గొడవ ఆగలేదు. ఈ సంఘటన స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది.

