17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంతో రూపొందిన హరి హర వీర మల్లు పార్ట్-1 పీరియడ్ యాక్షన్ డ్రామా. ఈ అధిక బడ్జెట్ చిత్రంలో పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో అలరించనుండగా, బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి తారాగణం ముఖ్య పాత్రలు పోషించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ కథ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే వీర మల్లు అనే చారిత్రాత్మక వీరుడి జీవితం ఆధారంగా ఉంటుంది. అణచివేతకు గురైన వారి కోసం పోరాడే అతని సాహస గాథ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

