Friday, April 3, 2026
35.2 C
Hyderabad

ఆత్యయిక స్థితులలో మానసిక ఆరోగ్య సేవల అందుబాటు|ARTICLE|ESSAY

World Mental Health Day: 10 October 2025
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: 10 అక్టోబర్ 2025

విపత్తులు సంభవించినప్పుడు ప్రభావిత సమూహాలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి. మూడింట ఒక వంతు బాధిత ప్రజలు తీవ్రమైన మానసిక రుగ్మతలకు లోనయ్యే అవకాశం ఉన్నది. 2020లో 10 కోట్ల ప్రజ విపత్తుల మూలంగా మానసిక రుగ్మతలకు గురైనట్లు తెలుస్తోంది. నేడు 6 కోట్ల 70 లక్షల మంది విపత్తు, సంక్షోభం, విస్థాపన పరిస్థితులలో మానసిక రుగ్మతలతో బాధ పడుతున్నట్లు అంచనా. భౌతిక అవసరాలు ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్య అవసరాలూ అంతకంటే ముఖ్యం. అంటూ…
హైదరాబాద్ సైకలాజికల్ అసోసియేషన్ జీవితకాల సభ్యులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ రాపోలు సత్యనారాయణ రాసిన ప్రత్యేక వ్యాసం ఎడిటోరియల్

ప్రతి ఏటా అక్టోబర్ 10 న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంను జరుపుకొంటున్నాము. అందరికీ మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించటానికి, మనోవ్యాధులు ఉన్నవారు, వారి కుటుంబాలు, సమాజాల పట్ల వివక్షను తొలగించటానికి ఇది ఒక సందర్భం. ఈ దినోత్సవం కోసం ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య (డబ్ల్యూ ఎఫ్ ఎం ఎచ్) ఏటా ఒక నినాదాన్ని ఎంపిక చేస్తుంది. మారుతున్న సంక్షోభాల కాలంలో మానసిక ఆరోగ్య అవసరాలూ మారుతున్నాయి. 2025 సంవత్సరానికి “యాక్సెస్ టు సర్వీసెస్ – మెంటల్ హెల్త్ ఇన్ కటాస్ట్రోఫ్స్ అండ్ ఎమర్జెన్సీస్” అనే థీమ్ ను ఎంపిక చేసింది.
విపత్తులు సంభవించినప్పుడు ప్రభావిత సమూహాలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి. సుమారు మూడింట ఒక వంతు బాధిత ప్రజలు తీవ్రమైన మానసిక రుగ్మతలకు లోనయ్యే అవకాశం ఉన్నది. 2020 లో సుమారు 10 కోట్ల ప్రజ విపత్తుల మూలంగా మానసిక రుగ్మతలకు గురైనట్లు తెలుస్తోంది. నేడు 6 కోట్ల 70 లక్షల మంది విపత్తు, సంక్షోభం, విస్థాపన పరిస్థితులలో మానసిక రుగ్మతలతో బాధ పడుతున్నట్లు అంచనా.
కొన్ని విపత్తులు ప్రకృతి ప్రకోపాలు అయితే, మరికొన్ని మానవ జనితాలు. కొన్నింటిని ముందే పసికట్ట వచ్చు. కొన్ని మన చేతిలో లేక పోవచ్చు. నివారణ మన చేతిలో లేక పోయినా, సంసిద్ధత, ప్రణాళిక, సమన్వయంతో కూడిన నష్ట నివారణ చర్యలు, సహాయక చర్యలు బాధితులను కుదుట పడేలా చేస్తాయి. ఈ దిశగా జరిగిన ప్రయత్నాలలో 2024 వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సభ్యదేశాలు ఏకగ్రీవంగా చేసిన తీర్మానం ఒక మైలురాయి. ఈ తీర్మానం మెంటల్ హెల్త్ అండ్ సైకో సోషియల్ సపోర్ట్ (ఎం ఎచ్ పి ఎస్ ఎస్) ను విపత్తు, ఆత్యయిక సేవల సంసిద్ధత, స్పందన, పునస్థాపనలో అంతర్భాగం చేసింది. ఎం ఎచ్ పి ఎస్ ఎస్ అనేది ఘటన జరిగిన తరువాత చేపట్టే పని కాదు. ఆత్యయిక పరిస్థితిలో ఆదుకొనే అన్ని చర్యలలో కలిసి చేసేది ఇది. ఐక్యరాజ్య సమితి దాని అనుబంధ సంస్థలన్నీ ఈ విషయంలో సమష్టిగా కృషి చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2024 సంవత్సరంలో 21 లక్షల అవసరార్థులకు మానసిక రుగ్మతలకు పనిచేసే ఔషధాలను అందచేసింది. ప్రస్తుతం ప్రపంచంలో వివిధ చోట్లలోని 40 ఆత్యయిక పరిస్థితులలో ఇతర సంస్థల సమన్వయంతో ఎం ఎచ్ పి ఎస్ ఎస్ సేవలు అందిస్తున్నది. ఆస్తి నష్టాలను పూడ్చవచ్చు. శారీరక గాయాలు కొంత కాలానికి మానవచ్చు. మానసిక గాయాల ప్రభావం జీవిత కాలం ఉండవచ్చు.
భారతదేశం విపత్తు నిర్వహణ కోసం వ్యవస్థాపరమైన ఏర్పాట్లు చేసింది. మానసిక సమస్యల పరిష్కారం కోసం 2022 లో టెలి మానస్ అనే 24 గంటల టోల్ ఫ్రీ నంబర్ 14416 ను అందుబాటు లోనికి తెచ్చింది. విపత్తు నిర్వహణలో భాగం అయ్యేందుకు గత ఏడాది బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నింహాన్స్) లో డిపార్ట్మెంట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ సైకో సోషియల్ సపోర్ట్ ను ప్రారంభించింది. ఈ డిపార్ట్మెంట్ ప్రత్యక్ష భాగస్వామ్యంతో పాటు, మానసిక ఆరోగ్య నిపుణులు, సంఘ సేవకులు, అధికారులకు శిక్షణ ఇస్తున్నది. భౌతిక అవసరాలు ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్య అవసరాలూ అంతే ముఖ్యం.

డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఫోన్: 9440163211

(వ్యాసకర్త హైదరాబాద్ సైకలాజికల్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడు)

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News