బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ నేడు లీలావతి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కానున్నారు. జనవరి 16న ఒక దుండగుడు ఆయన ఇంట్లో చొరబడి కత్తితో గాయపరచిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనను ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు.వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన సైఫ్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ ఘటనపై పోలీసులు చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని, నేడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నట్లు సమాచారం.

