Monday, April 6, 2026
35.2 C
Hyderabad

మోదీ జీ..! వినబడుతోందా!?|EDITORIAL

‘ పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట!’ ఈ సామెత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు సరిగ్గా సరిపోతుంది. ఆయనకు ఆ పదవి కట్టబెట్టినందుకు ఆ దేశ పౌరులే తలలు పట్టుకుంటున్నారు. ఇక ప్రపంచ దేశాలైతే, ట్రంపు టెంపరితనానికి ఠారెత్తిపోతున్నాయి. ఆయన చపల చిత్తం, నోటి దూల, అధికార దాహం, అహంకారం, అంధకారం, మథాంధకారం, శాడిజం, వక్రబుద్ధి, ఆత్మస్తుతి, పరనింద, కోపం అత్యాశ, అసూయ, ద్వేషం, మోసం, దగా, యుద్ధ కాంక్ష, శాంతి జపం వంటి మానవ అవలక్షణాలన్నీ కలిస్తే బహుషా ట్రంపు అవుతాడేమో?! ఎవరినైనా తిట్టాలంటే, ఇక ‘నువ్వు ట్రంపువా? మనిషివా?’ అనే నానుడి స్థిరపడిపోతుందేమో! ఈ పదవులు, అధికారం శాశ్వతం కాదు. చివరకు మనిషే శాశ్వతం కానీ ఈ లోకంలో.. ట్రెంపరితనపు పోకడలు మొత్తం భూగోళాన్నే గందరగోళం చేసి, నిజంగానే చికాకు పెడుతున్నాయి.

మరి ట్రంప్‌ విషయంలో మోదీ తీసుకునే నిర్ణయం ఏంటి? అమెరికాకు, ట్రంప్ టెంపరితనానికి తగిన గుణపాఠం చెబుతారా? ప్రపంచ మద్దతు కూడ గట్టి బుద్ధి చెప్పగలరా? నెత్తి కొరికిన పేనుని చివరకు ఏం చేస్తాం? యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

‘ పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట!’ ఈ సామెత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు సరిగ్గా సరిపోతుంది. ఆయనకు ఆ పదవి కట్టబెట్టినందుకు ఆ దేశ పౌరులే తలలు పట్టుకుంటున్నారు. ఇక ప్రపంచ దేశాలైతే, ట్రంపు టెంపరితనానికి ఠారెత్తిపోతున్నాయి. ఆయన చపల చిత్తం, నోటి దూల, అధికార దాహం, అహంకారం, అంధకారం, మథాంధకారం, శాడిజం, వక్రబుద్ధి, ఆత్మస్తుతి, పరనింద, కోపం అత్యాశ, అసూయ, ద్వేషం, మోసం, దగా, యుద్ధ కాంక్ష, శాంతి జపం వంటి మానవ అవలక్షణాలన్నీ కలిస్తే బహుషా ట్రంపు అవుతాడేమో?! ఎవరినైనా తిట్టాలంటే, ఇక ‘నువ్వు ట్రంపువా? మనిషివా?’ అనే నానుడి స్థిరపడిపోతుందేమో! ఈ పదవులు, అధికారం శాశ్వతం కాదు. చివరకు మనిషే శాశ్వతం కానీ ఈ లోకంలో.. ట్రెంపరితనపు పోకడలు మొత్తం భూగోళాన్నే గందరగోళం చేసి, నిజంగానే చికాకు పెడుతున్నాయి.

హద్దు పద్దు లేకుండా ప్రవర్తిస్తున్న ట్రంప్ తీరుపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఏ దేశం ఎవరితో స్నేహ హస్తం చాచాలో కూడా ట్రంపే చెబుతాడట! ఏ దేశం మరేదేశంతో వాణిజ్యం చేయాలో కూడా ట్రంపే నిర్దేశిస్తాడట. అదే అమెరికా దేశాన్ని ట్రంప్ లా ఎవరైనా ప్రశ్నిస్తే సహిస్తాడా? మరి పర దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నంచే హక్కు ట్రంప్ కు ఎక్కడిది. ఎవరిచ్చారు? ట్రంప్‌ ఆంక్షలను ఎవరైనా ఎందుకు అంగీకరించాలి? చర్చలు జరిపేది లేదంటున్న ట్రంప్‌తో మనం కూడా ఎందుకు చర్చలు జరపాలి? చర్చలు జరిపినా, జరపకపోయినా,140 కోట్ల జనాభా ఉన్న భారత్‌తో పెట్టుకుంటే ఏమవుతుందో ట్రంపకు అర్థం చేయాలి. మనపై వాణిజ్య ఆంక్షలు విధిస్తూ, పాక్‌ను దువ్వుతున్న తీరు అమెరికా ద్వంద్వ నీతిని తెలియ చేస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై అమెరికా విధించిన అదనపు సుంకాలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ట్రంప్‌ ఏకపక్ష నిర్ణయాలు ఒక్క భారత్‌కే కాదు యావత్ ప్రపంచ దేశాలకు పరీక్షగా మారాయి. ముందుగా చైనా అదే స్థాయిలో తిరిగి అమెరికాపై సుంకాలు విధించి అమెరికా దిమ్మ తిరిగేలా చేసింది. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను తమపై విధించడంతో భారత్‌ కూడా చైనా తరహాలోనే దీటుగా స్పందించింది. తమ దేశంలోని రైతులు, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసింది. గురువారం నుంచే అమలులోకి వచ్చిన 25 శాతం సుంకాలతోపాటు, ఆగస్టు 27 నుంచి 50శాతానికి చేరే సుంకాలకు తోడుగా భారత్‌పై మరిన్ని ఆంక్షలను విధిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. ఆయన విధించిన సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీనివల్ల అమెరికాలోనూ కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. పెంచిన సుంకాల వల్ల బిలియన్ల కొద్దీ డాలర్లు అమెరికాకు వస్తాయని ట్రంప్‌ నమ్మబలుకుతున్నారు.

అమెరికా అదనపు సుంకాల వల్ల ఇరు దేశాల మధ్య తలెత్తిన వివాదం తాత్కాలికమేనని, త్వరలోనే సమసిపోతుందని ప్రవాస భారతీయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. చర్చలు ఫలించి త్వరలో ఒప్పందం కుదురుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 50 లక్షల మంది ప్రవాస భారతీయులు అమెరికా అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారు. భారతీయ ఉత్పత్తులపై 50శాతం సుంకాలను వేయడాన్ని ఇండియన్‌-అమెరికన్ల నేత, బైడెన్‌ మాజీ సలహాదారు అజయ్‌ భుటోరియా ఖండించారు. ’అమెరికాలో తక్కువ ధరలకు లభించే 50శాతం జనరిక్‌ మందులను భారత్‌ సరఫరా చేస్తోంది. ఈ సుంకాలు వాటి ధరలను కూడా పెంచుతాయి. దీనివల్ల అమెరికాలోని కుటుంబాలు, సీనియర్‌ సిటిజన్లు, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడతారు. మసాలా దినుసులు, పప్పులు, దుస్తుల ధరలు పెరుగుతాయని పేర్కొన్నారు. దుస్తులు, పాదరక్షల ధరలు 37శాతం దాకా పెరగవచ్చని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ఇదే విషయాన్ని గుర్తుచేశారు. అయితే, ట్రంప్‌ విధించిన అదనపు సుంకాలపై ప్రధాని మోదీ గట్టిగానే సమాధానమిచ్చారు. ఎంత మూల్యమైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వారిని కాపాడటం కోసం సుంకాల భారాన్ని సొంతగా భరించడానికీ సిద్ధం అని ప్రధాని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే, శ్వేత సౌధంలోని ఓవల్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘భారత్‌పై మేం 50శాతం సుంకాలను విధించిన విషయం మీకు తెలుసు. ఆ దేశం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో రెండో స్థానంలో ఉంది. తొలిస్థానంలోని చైనాకు అతి దగ్గరగా ఉంది. అందుకే భవిష్యత్తులో మరిన్ని ఆంక్షలను చూడబోతున్నార’ని పేర్కొన్నారు. ట్రంప్‌ తీరు తన అధికారాన్ని పిచ్చోడి చేతిలో రాయిలా వాడుకుంటున్నట్లుగా ఉంది. ఎలాన్‌ మస్క్‌ లాంటి మిత్రుడినే దూరం పెట్టిన ట్రంప్‌కు భారత్‌ ప్రయోజనాలు అంత ముఖ్యం కాదు. లెక్కలోకీ రావు.

ఆపరేషన్‌ సింధూర్‌ భారత్ సైనిక పాఠవాన్ని ప్రపంచానికి చాటింది. అలాగే అమెరికా ప్రపంచ దేశాలను బెదిరించి ఎక్కువ ధరలకు అమ్ముతున్న పాక్ ఆయుధాలు తుస్ మనడమూ అన్ని దేశాలూ చూశాయి. అందుకే పాక్ ను బెదిరించి మరీ, భారత్ కాళ్ళ బేరానికి పంపాడు. భారత్‌ భద్రతా వలయాన్ని చూసి ట్రంప్‌ తట్టుకోలేక పోతున్నాడు. సైనిక పరంగా మనల్ని ఎదుర్కోలేక సుంకాలతో కొడుతున్నాడు.

అయోధ్య, కాశ్మీర్‌, ట్రిపుల్‌ తలాక్‌ విషాయల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న మోదీ, ఆపరేషన్‌ సిందూర్‌ తో పాక్ పీచమణిచారు. గట్టిగా బుద్ది చెప్పాం. ప్రపంచం ముంగిట పాక్ ని దోషిగా నిలబెట్టాం. ప్రపంచ వ్యాప్తంగా భారత్ చర్యలకు గట్టి మద్దతు లభించింది. మరి ట్రంప్‌ విషయంలో మోదీ తీసుకునే నిర్ణయం ఏంటి? అమెరికాకు, ట్రంప్ టెంపరితనానికి తగిన గుణపాఠం చెబుతారా? ప్రపంచ మద్దతు కూడ గట్టి బుద్ధి చెప్పగలరా? నెత్తి కొరికిన పేనుని చివరకు ఏం చేస్తాం? యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మోదీజీ వినబడుతోందా!?

Latest News

06-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ చవితి ఉదయం 11.47 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనూరాధ రాత్రి 12.45 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సిద్ది మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి వ్యతీపాత కరణం బాలవ ఉదయం 11.47...

గా ఊల్లె.. అందరికీ ఒకటే వంట!?|ADUGU TRENDS

గా ఊల్లె నిజంగా రోజూ పండుగే? ఎవలింట్లా పొయ్యి ఎలగదు. ఊరంతటికీ ఒకటే పొయ్యి. కులం లేదు మతం లేదు. గా ఊరంతా ఒకటే కుటుంబం. రోజూ అంతా కలిసే ఉంటరు. ఒకదగ్గరనే...

గ్రామాలు బలపడితేనే దేశాభివృద్ధి!|EDITORIAL

మనది గ్రామీణ భారతం. గ్రామాలతోనే దేశం బాగుపడుతుంది. అభివృద్ధి అనగానే “ట్రిలియన్ డాలర్ ఎకానమీ”, “ఫ్యూచర్ సిటీలు” వంటి ఆకర్షణీయమైన లక్ష్యాలు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ లక్ష్యాలు సాధ్యమవ్వాలంటే గ్రామాలు బలపడటం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 05, 2026 నుండి ఏప్రిల్ 11, 2026 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా ఫలితాలు మంచిగా ఉంటాయి....

గిట్లంటే, గీ గ్యాస్ సిలండర్ మూతొత్తది!?|ADUGU TRENDS

ఇండ్లల్ల గ్యాస్ అయిపోయిందని తెల్వంగనే పక్కన పడేత్తం. కనీ, గా గ్యాస్ అయిపోయిందా? లేదా అని సూడాల్నంటే, గా మూత తీయాలె. గది తీయాల్నంటే మస్తు భయమైతది. కనీ, గా మూత తీసుడు...

యుద్ధం: వాస్తవాలు, అపోహలు, ప్రభావాలు|EDITORIAL

ప్రపంచం వేగంగా మారుతోంది. ఒక చోట చోటు చేసుకునే సంఘటనలు మరో చోట జీవన విధానాన్ని అంతకంటే వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం, ఉద్రిక్తతలు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది....

04-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు విదియ ఉదయం 08.22 వరకు ఉపరి తదియ నక్షత్రం స్వాతి రాత్రి 07.58 వరకు ఉపరి విశాఖ యోగం హర్షణ మద్యాహ్నం 01.00 వరకు ఉపరి వజ్ర కరణం గరజి ఉదయం 08.22...

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News