Friday, April 3, 2026
33.2 C
Hyderabad

అ‘హింస’!?|AHIMSA|MAOIST

మాట్లాడితే తప్పేంటి?
ముచ్చటిస్తే ముప్పేంటి?
PEACE|శాంతి చర్చలపై రాజ్యం కర్తపు టేరులు!
‘శత్రువు’పై కనికరం! ‘మాట’పై మారణ‘హోమం’!!

రాజ్యం తన పిల్లలను తానే చంపుకుంటుందా? తన సంతతిని తానే సర్వనాశనం చేసుకుంటోందా? తన భవిష్యత్తును తానే చిదిమేసుకుంటుందా? సమస్యలను వదిలేసి, ఆ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న వాళ్ళని చంపేసి రాజ్యం సాధించేదేంటి? హింస. హింసకు ప్రతి హింస. ఆ ప్రతి హింసకు మరో హింస. ప్రాణాలు ఎవరికైనా ఒక్కటే! తుపాకీ పట్టడం రాజ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకం. నిజమే, కానీ వారు ఆ తుపాకీ పట్టడానికి కారణాలేంటి? కారకులెవరు? రాజ్యానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం, తిరుగుబాటు ఎందుకు జరుగుతుంది? అందుకు కారణాలు వెతకకుండా, కారకులను అంతమొందిస్తే, ఆ ఉద్యమాలు, పోరాటాలు ఆగిపోతాయా? తాత్కాలికంగా ఆగిపోతే పోవచ్చు కానీ, మరో రూపంలో అవి మళ్ళీ తలెత్తవన్న గ్యారెంటీ ఏంటి? దోపిడీ, అణచివేత ఉన్నంత కాలం, పోరాటం, తిరుగుబాటు కచ్చితంగా కలుగుతుంది. చర్యకు ప్రతి చర్య అనేది సామాన్య సూత్రం. ప్రతి చర్యకు ప్రతిచర్య, ఆ ప్రతి చర్యకు మరో ప్రతిచర్య… ఇలా అంతులేని, అదుపులేని చర్యలు అశాంతికి, అభద్రతకు దారితీస్తాయి. మొత్తానికి విలువైన మానవ జీవితాలకే విలువ లేకుండా పోయింది.

2025, మార్చి 31 నాటికి దేశంలో కమ్యూనిస్టు తీవ్రవాదాన్ని పూర్తిగా అణచి వేయాలన్నది ఆపరేషన్ కగార్ లక్ష్యం. మావోయిస్టుల ఏరివేత అత్యంత ఉధ్రుతంగా సాగుతున్నది. అనేక మంది మావోయిస్టులు, వారికంటే అధికంగా గిరిజనులు హతమవుతున్నారు. అసలు మావోయిజం ఏంటి? ఈ నక్సలైట్లు ఎవరు?

నిజానికి నక్సలిజాన్ని, నక్సలైట్లను సమర్ధించడం కాదు కానీ, ఆ ఉద్యమ హింసను మినహాయిస్తే, వారి భయంతో గ్రామాల్లో పెత్తందారీ వ్యవస్థ ఆగిపోయింది. దొరల, భూస్వాముల గడీల ఆగడాలు అంతమొందాయి. రాజకీయ నేతల ఆరాచకాలు, అసాంఘిక శక్తులు అదుపులో ఉండేవి. తప్పు చేయడానికి జంకేవారు. అంతెందుకు పోలీసు వ్యవస్థ అంటే విలువ, గౌరవం, భయం, భక్తి ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

మొత్తంగా ఇప్పుడు మావోలను అంతమొందించే ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. శత్రు దేశం అడిగిందే తడవు యుద్ధాన్ని విరమించిన మన ప్రభుత్వం, ‘మన బిడ్డలే’ అడిగినా వినకుండా వారిపై యుద్ధాన్ని చేస్తూ మట్టుపెట్టడం ఏ మానవీయతకు, మరే మారణహోమానికి సంకేతం? అయితే దోపిడీ ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది. రాజకీయ దోపిడీ ఉంటే తిరుగుబాటు తప్పదని చరిత్ర రుజువు చేసింది. ప్రభుత్వం మావోయిస్టులను అంతమొందించడం సులువే కావచ్చు. కానీ, ప్రజల్లో గూడుకట్టుకున్న ఆందోళనలను అణచివేయడం మాత్రం అసాధ్యమని గుర్తించాలి.

‘శత్రువు’పై కనికరం! ‘మాట’పై మారణ‘హోమం’!!

రాజ్యం తన పిల్లలను తానే చంపుకుంటుందా? తన సంతతిని తానే సర్వనాశనం చేసుకుంటోందా? తన భవిష్యత్తును తానే చిదిమేసుకుంటుందా? సమస్యలను వదిలేసి, ఆ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న వాళ్ళని చంపేసి రాజ్యం సాధించేదేంటి? హింస. హింసకు ప్రతి హింస. ఆ ప్రతి హింసకు మరో హింస. ప్రాణాలు ఎవరికైనా ఒక్కటే! తుపాకీ పట్టడం రాజ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకం. నిజమే, కానీ వారు ఆ తుపాకీ పట్టడానికి కారణాలేంటి? కారకులెవరు? రాజ్యానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం, తిరుగుబాటు ఎందుకు జరుగుతుంది? అందుకు కారణాలు వెతకకుండా, కారకులను అంతమొందిస్తే, ఆ ఉద్యమాలు, పోరాటాలు ఆగిపోతాయా? తాత్కాలికంగా ఆగిపోతే పోవచ్చు కానీ, మరో రూపంలో అవి మళ్ళీ తలెత్తవన్న గ్యారెంటీ ఏంటి? దోపిడీ, అణచివేత ఉన్నంత కాలం, పోరాటం, తిరుగుబాటు కచ్చితంగా కలుగుతుంది. చర్యకు ప్రతి చర్య అనేది సామాన్య సూత్రం. ప్రతి చర్యకు ప్రతిచర్య, ఆ ప్రతి చర్యకు మరో ప్రతిచర్య… ఇలా అంతులేని, అదుపులేని చర్యలు అశాంతికి, అభద్రతకు దారితీస్తాయి. మొత్తానికి విలువైన మానవ జీవితాలకే విలువ లేకుండా పోయింది.

2025, మార్చి 31 నాటికి దేశంలో కమ్యూనిస్టు తీవ్రవాదాన్ని పూర్తిగా అణచి వేయాలన్నది ఆపరేషన్ కగార్ లక్ష్యం. మావోయిస్టుల ఏరివేత అత్యంత ఉధ్రుతంగా సాగుతున్నది. అనేక మంది మావోయిస్టులు, వారికంటే అధికంగా గిరిజనులు హతమవుతున్నారు. అసలు మావోయిజం ఏంటి? ఈ నక్సలైట్లు ఎవరు? 1967లో పశ్చిమ బెంగాల్ లోని నక్సల్బరీ అనే గ్రామంలో భూస్వాములపై రైతు కూలీల తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు చేసిన వారిని నక్సలైట్ అన్నారు. చైనా తరహాలో దేశంలో దీర్ఘకాలిక ప్రజా యుద్ధాన్ని ఆకాంక్షిస్తూ చారుమజుందార్ రాసిన 8 పత్రాలే నక్సల్స్ ఉద్యమానికి పునాది. చారు మజుందార్, కను సన్యాల్, జంగల్ సంతల్ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ఒక వర్గంగా ఏర్పడింది. ఆ తిరుగుబాటు ఏప్రిల్ 1969లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) ఏర్పాటుకు దారితీసింది. ఇది ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలలో ఇలాంటి ఉద్యమాలకు ప్రేరణనిచ్చింది. 1972 జులైలో చారు మజుందార్ పోలీసు కస్టడీలో మరణం తర్వాత నక్సలిజం దాదాపు అంతమైంది. 1970 చివరలో నక్సలిజం మళ్ళీ చిగురించింది. 1980 నాటికి దేశంలో 30 నక్సలైట్ గ్రూపులు, 30వేల మంది సభ్యులతో ఉన్నాయని అంచనా. 1980లో కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తితో కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పీపుల్స్ వార్ ని స్థాపించారు. ఇది మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాతో విలీనం అయి 2004లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)గా ఏర్పాటైంది. నక్సలైట్ ఉద్యమం మొదలైన నాటి లాగే, ఆ తర్వాత కాలంలోనూ విద్యార్థులే ఈ ఉద్యమానికి ఆకర్షితులైయ్యారు. ఆ తర్వాత మారిన సామాజిక, రాజకీయ, ఆర్థిక, అణచివేత, ఆలోచనల పరిణామాల్లో రిక్రూట్ మెంట్ కూడా తగ్గి, ఉద్యమం అడవులకు, గిరిజనులకే పరిమితమైంది. అయితే, అక్టోబర్ 11, 2004న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో 11 మంది మావోయిస్టుల బృందంతో 4 రోజుల పాటు చర్చలు జరిగాయి. అదే తరహా చర్చలకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద అఖిల పక్షాలు మహాధర్నా నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ను ఆపాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, అథమం గిరిజన సంఘాలతోనైనా చర్చలు జరపాలని మేధావులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరామ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సినీ నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ మహా ధర్నా ముగిసిన కొద్ది గంటల్లోనే జరిగిన మరో భారీ ఎన్‌కౌంటర్‌ లో మావోయిస్టు అగ్రనేతలు ముగ్గురు హతమయ్యారు. మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌ మృతి చెందాడు. నాలుగు దశాబ్దాల క్రితం పీపుల్స్‌ వార్‌ ఉద్యమంలోకి వెళ్లిన గాజర్ల రవి దళ సభ్యుడి స్థాయి నుంచి కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వంతో మావోయిస్టులు జరిపిన శాంతి చర్చల్లో ప్రతినిధిగా ఉన్నారు. ఈ సమయంలోనూ ఇక చర్చలకు తావు లేదన్న విధంగా కేంద్రం మొండిగా ఉంది. కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత, మణిపూర్‌ అల్లర్లు అణచివేయడంలో లేని దూకుడును మావోల అంతానికి కేంద్రం ప్రదర్శిస్తోంది.

నిజానికి నక్సలిజాన్ని, నక్సలైట్లను సమర్ధించడం కాదు కానీ, ఆ ఉద్యమ హింసను మినహాయిస్తే, వారి భయంతో గ్రామాల్లో పెత్తందారీ వ్యవస్థ ఆగిపోయింది. దొరల, భూస్వాముల గడీల ఆగడాలు అంతమొందాయి. రాజకీయ నేతల ఆరాచకాలు, అసాంఘిక శక్తులు అదుపులో ఉండేవి. తప్పు చేయడానికి జంకేవారు. అంతెందుకు పోలీసు వ్యవస్థ అంటే విలువ, గౌరవం, భయం, భక్తి ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

ఆపరేషన్‌ కగార్‌ ను కార్పొరేట్‌ కబ్జాగా, మానవత్వానికి మాయని మచ్చగా మేధావులు అభివర్ణిస్తున్నారు. జల్‌, జంగిల్‌, జీమీన్‌ నినాదానికి పరిష్కారం ఏది? మావోలతో చర్చలు జరపాలన్న వాళ్ళని అర్బన్ నక్సల్స్ గా ముద్ర వేస్తున్నారు. మావోయిస్టులు మైకులు ఎందుకు పట్టుకుంటారు? అని అసహనం వ్యక్తం చేశారు. చర్చలకు సిద్ధంగా ఉన్నా చంపడమేంటని ప్రశ్నించారు. అడవుల్లోని ఖనిజ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకే అమిత్‌ షా నక్సలైట్‌ రహిత దేశంగా చేస్తామంటున్నారని కూడా విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్‌ తో చర్చలు జరిపిన కేంద్రం.. భరత మాత ముద్దు బిడ్డలైన మావోలతో ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. అన్యాయాన్ని అడిగిన వాడు నక్సలైట్‌.. అడగని వాడు ఆల్‌ రైట్‌ అనే ఉద్దేశంతో కేంద్రం వ్యవహరిస్తుందని విమర్శించారు.

మొత్తంగా ఇప్పుడు మావోలను అంతమొందించే ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. అయితే దోపిడీ ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది. రాజకీయ దోపిడీ ఉంటే తిరుగుబాటు తప్పదని చరిత్ర రుజువు చేసింది. ప్రభుత్వం మావోయిస్టులను అంతమొందించడం సులువే కావచ్చు. కానీ, ప్రజల్లో గూడుకట్టుకున్న ఆందోళనలను అణచివేయడం మాత్రం సాధ్యం కాదని గుర్తించాలి.

-డా. మార్గం లక్ష్మీనారాయణ 

 

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News