Friday, April 3, 2026
32.2 C
Hyderabad

ఎడిటోరియల్ : 12.03.2025

చట్ట సభలను చులకన చేయొద్దు!

చట్టసభలకు ఎన్నికైన వారు..సభకు, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాలి. సభలో ప్రజల పక్షాన నిలబడాలి. హోదాతో సంబంధం లేకుండా నడుచుకునేలా చూసుకోవాలి. అయితే తెలుగు రాష్టాల్ల్రో విచిత్ర పరిస్థితి నెలకొంది. రెండు రాష్ట్రాల్లోనూ మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరూ సభలకు వెళ్ళడం లేదు. ప్రతిపక్షహోదా కలిగిన బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ చట్టసభలకు రావడం లేదు. సభలో ప్రజాసమస్యలపై చర్చించడం లేదు. ప్రతిపక్ష హోదా ఉన్నా కూడా యాన సభకు రాకుండా మొహం చాటేస్తున్నారు. పదేళ్లపాటు సిఎంగా పని చేసిన కెసిఆర్‌ విపక్షానికి పరిమితం కావడంతో ఇక ప్రజలతో పనేం!? అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభుత్వం బాగా పనిచేయడం లేదని, ఇక అంతు తేలుస్తానని బయటనుంచి మాట్లాడుతున్నారు. కానీ సభకు వచ్చి సమస్యలను ప్రస్తావించడం, తన ప్రభుత్వ హయాంలో జరిగిన మంచి చెడులను చర్చించడం లేదు. ఇది ఓ రకంగా ప్రజలను అవమానించడమే! అలాంటప్పడు జీతభత్యాలు తీసుకోరాదు. నిజానికి ప్రజాప్రతినిధులకు జీతభత్యాలు, పెన్షన్లపై చర్చించాలి. వారికి కోట్లాది రూపాయలు చెల్లించాల్సిన అవసరమేముందో తేల్చాలి. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుతో వారు సుఖాలు అనుభవిస్తున్నారు.

ఎ.పి అసెంబ్లీలో జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అంశం మీద ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ప్రతిపక్షహోదా ఇస్తే తప్ప సభకు రానని మూర్ఖంగా వాదించడం జగన్‌కే చెల్లింది. ప్రతిపక్ష హోదాకు సభా సంప్రదాయాలు, నియమాలు ఉన్నాయి. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా, గతంలో ఎంపిగా పనిచేసిన జగన్‌ చట్టాల గురించి తెలుసుకోకుండా సభకు రానని చెప్పడం ఎన్నుకున్న ప్రజలను అవమానించడమే!

ప్రతిపక్షహోదా ఉన్న కెసిఆర్‌ రావడం లేదు..విపక్ష హోదా లేదు కనుక రాను పో అని జగన్‌ అంటున్నారు. ఇలాంటి నేతలను నమ్ముకుంటే ప్రజలు నట్టేట మునగడం ఖాయం. జగన్‌కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేది రాజకీయ నిర్ణయం కాదు. ఈ విషయంలో పార్లమెంటరీ సంప్రదాయాలు ఏం చెబుతున్నాయో పరిశీలించాలి. పార్లమెంటులో లేదా, అసెంబ్లీలో రాజకీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. రాజకీయ పార్టీగా గుర్తింపు పొందితే, ఆ పార్టీ పార్లమెంటు లేదా అసెంబ్లీ ప్రాంగణంలో కొన్ని వసతులు పొందడానికి వీలుంటుంది. ఇటువంటి గుర్తింపు సభాపతి నుంచి వస్తుంది. ఎన్నికల సంఘం దగ్గర రాజకీయ పార్టీగా నమోదు చేసుకొని ఎన్నికల్లో పోటీ చేస్తాయి రాజకీయ పార్టీలు. అటువంటి పార్టీలకు చట్టసభలో ఒక సీట్‌ వున్నా అవి పార్లమెంటులో రాజకీయ పార్టీలుగానే కొనసాగుతాయిగానీ సభాధ్యక్షుడి గుర్తింపు వుండదు. సభాధ్యక్షుడి గుర్తింపు పొందితేనే సభా ప్రాంగణంలో కార్యాలయానికి గది కేటాయింపు వంటి వసతుల కల్పనకు అవకాశం ఉంటుంది. స్పీకర్‌ ఆధ్వర్యంలో పనిచేసే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశాలకు పిలుపు వస్తుంది. వసతుల కల్పనకు నిబంధనలు వేరుగా ఉంటాయి. దీనికి సంబంధించి పార్లమెంటులో మూడు నిబంధనలు పొందుపరిచారు. వాటినే అసెంబ్లీల్లో పాటిస్తున్నారు. కనీసం పదిశాతం సీట్లు పొందిన వారికే విపక్షపార్టీగా గుర్తింపు దక్కుతుంది.

గత పార్లమెంటులో కాంగ్రెస్‌ పార్టీకి విపక్షహోదా దక్కలేదు. అది కావాలని ఆ పార్టీ పట్టుబట్టలేదు. ఫలితంగా పది సంవత్సరాలు లోక్‌సభలో ప్రతిపక్ష నేత అన్న వ్యవస్థ లేకుండా గడిచింది. 2014లోనూ, 2019 లోనూ కాంగ్రెస్‌ పార్టీ అతి పెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ దానికి పదో వంతు సంఖ్యా బలం లేదు. పదో వంతు సంఖ్యా బలం లేనప్పుడు ప్రతిపక్ష గ్రూప్‌గా గుర్తిస్తారుగాని ప్రతిపక్ష పార్టీగా గుర్తించక పోవటం గతంలో కూడా జరిగింది. 1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో లోక్‌సభలో అతి పెద్ద ప్రతిపక్షంగా ఏ జాతీయ పార్టీ నిలువలేదు. ప్రాతీయ పార్టీ అయిన తెలుగు దేశానికి ప్రతిపక్ష గ్రూప్‌ అన్న గుర్తింపు దక్కింది. అయితే చట్టంలో ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందాలంటే పదో వంతు సభ్యులుండాలన్న నిబంధన అన్నది సంప్రదాయంగా వస్తున్న నిబంధన మాత్రమే. 1977లో మొదటిసారి ప్రతిపక్ష నాయకుడు అనే వ్యవస్థ ఏర్పడింది. 1977లో అప్పటి జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపునకు కనీస సభ్యుల సంఖ్యను సూచించలేదు. సభలో అధికారపార్టీని వ్యతిరేకించే పార్టీలలో ఎక్కువమంది సభ్యులుండే పార్టీనేతను ప్రతిపక్ష నేతగా సభాధ్యక్షులు గుర్తిస్తారని పేర్కొన్నది. సభలో అధికార పక్షాన్ని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలు సమాన సంఖ్యా బలం కలిగి వుంటే ఏ పార్టీ నేతను ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించాలనేది ఆ యా పార్టీల స్థితిగతుల ఆధారంగా సభాధ్యక్షుడు నిర్ణయిస్తారు. ఆ విధంగా సభాధ్యక్షుడి గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేతకు కొన్ని సదుపాయాలు కల్పిస్తారు. సభ లోపల వెలుపలా కూడా. జీత భత్యాలు, వాహనం, సహాయ సిబ్బంది, అధికారిక నివాసం మొదలైనవి వస్తాయి.. ప్రతిపక్ష నేతకు కాబినెట్‌ మంత్రి హోదా కల్పించటం ఒక సంప్రదాయంగా వస్తున్నది. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే ఒక పార్టీకి చట్టసభలో గుర్తింపు పొందటానికి అవసరమైన సభ్యులే లేకపోతే, అలాంటి పార్టీ నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తే లేదనేది 2014లో నాటి లోక్‌సభ స్పీకర్‌ తేల్చేశారు. ఇది రాజకీయపరమైన నిర్ణయం. ఈ వాదన 2014లో తెర విూదకు వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పదో వంతు సభ్యులు కూడా లేరు. కాంగ్రెస్‌ పార్టీ దానివిూద ఏవిూ రాద్ధాంతం చేయలేదు. సభా కార్యకలాపాలకు దూరంగానూ లేదు. ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించవలసిన ప్రతి సందర్భంలోను అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభాపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరిని ప్రభుత్వం సంప్రదించింది. రాజ్యాంగ బద్ధమైన పదవులకు నియామకాలు చేసే కమిటీలో ప్రతిపక్ష నేత కూడా సభ్యుడు. ఉదాహరణకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నియామకం. అటువంటి నియామకాలప్పుడు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకున్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధీర్‌ రంజన్‌ చౌదరిని సంప్రదించింది.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే ప్రతిపక్షనేత హోదా కావాలని జగన్‌ పట్టుబట్టడం అసమంజసం. తనకు దక్కదని తెలిసి కూడా ఆ హోదా కోసం ఆరాటపడటం హుందాతనం అనిపించు కోదు. సభలో మాట్లాడటానికి కేటాయించే సమయం రాజకీయ పక్ష సభ్యుల సంఖ్యాబలం విూద ఆధారపడి ఉంటుంది. మాట్లాడే హక్కు ప్రతి సభ్యుడికీ ఉంటుంది. ఎంతసేపు అనేది సభాపతి నిర్ణయం. ప్రతిపక్షనేత గనుక కచ్చితంగా ఇంత సమయం కేటాయించాలి అన్న నిబంధన ఏవిూ లేదు. తనకు 40 శాతం ఓట్లు వేసిన ప్రజల పక్షాన పోరాడాల్సిన సమయంలో హోదా ఇవ్వలేదనే వంకతో అసెంబ్లీకి రాకపోవటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇది కెసిఆర్‌, జగన్‌ ఇద్దరికీ వర్తిస్తుంది. సభకు ఎన్నికయ్యాక సమావేవాలకు హాజరు కావాల్సిందే. ప్రజల పక్షాన నిలబడాల్సిందే. అంతే తప్ప తమ మూర్ఖ వాదనలతో ప్రజలను చులకన చేయడం సరికాదు.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News