Monday, April 6, 2026
35.2 C
Hyderabad

ఏపీలో ‘కల్తీ’ ఆజ్యం’!|EDITORIAL

సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంలో పడింది. లడ్డూ తయారీలో ఉపయోగించే ‘నెయ్యి కల్తీ’ అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తీవ్ర ఉద్రిక్తతల్లోకి నెట్టింది. పవిత్ర ఆలయ ప్రసాదం రాజకీయ యుద్ధంగా మారి, చివరికి పరస్పర దూషణలు, దాడులు, విధ్వంసాలకు దారితీయడం రాష్ట్ర ప్రజాస్వామ్య స్థాయిని దిగజార్చింది. రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ, దానికి పవిత్ర ఆలయాన్ని ఆలవాలం చేసుకోవడమేగాక, హింసాత్మకం చేయడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు.

ఇటీవల జోగిరమేశ్ ఇంటిపై పెట్రో బాంబు దాడి ప్రయత్నం, అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడులు, గతంలో నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన ఘటనలు రాజకీయ అసహనానికి ప్రతీకలు. వైకాపా హయాంలో ఇలాంటివి జరిగాయని విమర్శించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు పునరావృతమవడం అత్యంత దురదృష్టకరం. అధికారంలో ఎవరు ఉన్నా, ప్రజాస్వామ్యంలో హింసకు ఆస్కారం ఇవ్వకూడదు.

పవిత్ర తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ నెయ్యితో తయారైందన్న అంశాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఆలయ భూములు, ఆభరణాలు, నియామకాలు, పూజా విధానాలపై వివాదాలు వచ్చినా, లడ్డూ ప్రసాదం అంశం మాత్రం మరింత సున్నితమైనది.

2024 మేలో చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల ప్రక్షాళనపై హామీలు ఇచ్చారు. కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం తర్వాత లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. టీటీడీ అధికారులే పోలీసులకు ఫిర్యాదు చేయడం, ప్రభుత్వం ‘సిట్‌’ను నియమించడం వేగంగా జరిగిపోయాయి. ఇదే సమయంలో టీటీడీ మాజీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి సిట్‌కు బదులుగా సీబీఐ విచారణ కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

సుప్రీం కోర్టు ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధారాలు లేకుండా లడ్డూలో కొవ్వు కలిసిందని ప్రకటించి భక్తుల మనోభావాలను దెబ్బతీయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని హితవు పలికింది. అనంతరం సీబీఐ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో విచారణ జరిపి 36 మందిని నిందితులుగా చార్జిషీటులో చేర్చింది. ఉత్తరాఖండ్‌కు చెందిన భోలే బాబా డెయిరీ నిర్వాహకులు విపిన్ జైన్, పోమిల్ జైన్‌లను ప్రధాన కారకులుగా గుర్తించింది.

సీబీఐ నివేదిక ఈ వివాదానికి మరో మలుపు ఇచ్చింది. నెయ్యిలో భారీ స్థాయిలో కల్తీ జరిగిందని, అది అసలు నెయ్యే కాదని తేల్చినప్పటికీ, జంతు కొవ్వు లేదా పంది కొవ్వు కలిపినట్టు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. నమూనాల్లో నిజమైన నెయ్యి శాతం చాలా తక్కువగా ఉండగా, పామాయిల్, పామ్ స్టియరిన్, ఇతర రసాయనాలు కలిపినట్టు నిర్ధారించింది. భోలే బాబా డెయిరీ నుంచి పాలు లేదా నెయ్యి సరఫరా అయిన దాఖలాలు లేవని కూడా పేర్కొంది.

ఈ నివేదికను తమకు అనుకూలంగా మలుచుకుంటూ వైసీపీ నేతలు ‘మేము నిర్దోషులం’ అన్న ప్రచారాన్ని తీవ్రం చేశారు. జగన్ సహా పలువురు నేతలు ప్రాయశ్చిత్త హోమాలు, ఆలయ సందర్శనలు చేస్తూ రాజకీయ సంకేతాలు పంపారు. అయితే నెయ్యిలో కొవ్వు లేదన్న అంశాన్ని మాత్రమే పట్టుకుని, 200 కోట్ల రూపాయలకుపైగా విలువైన కల్తీ నెయ్యి సరఫరా నిజాన్ని విస్మరించడం సరికాదు. కల్తీ జరిగిందన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు.

వాస్తవానికి ఈ వ్యవహారాన్ని ఒక పార్టీ లేదా ఒక ప్రభుత్వ వైఫల్యంగా చూడలేం. ఎవరు అధికారంలో ఉన్నా ఏడుకొండలపై అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. పవిత్రతకు ప్రతీక అయిన తిరుమల వ్యవస్థలో లోపాలు కొనసాగుతున్నాయన్నది చేదు నిజం. కానీ ఈ అంశాన్ని రాజకీయంగా రెచ్చగొట్టి, ప్రజలను విభజించి, హింసకు ప్రేరేపించడం అత్యంత ప్రమాదకరం. అభ్యంతరకరం.

చివరికి ఈ వివాదం రాజకీయ విమర్శల నుంచి భౌతిక దాడుల వరకూ వెళ్లడం రాష్ట్రానికే కాదు రాజకీయాలకూ మంచిది కాదు. అధికార మార్పిడి ఇదే సంస్కృతి మరింత తీవ్రంతరం చేస్తుందన్న భయం సహజం. అందుకే ఇలాంటి సున్నితమైన పవిత్ర అంశాలను రాజకీయం చేయడం తగదు. పవిత్రమైన దేవాలయాలను రాజకీయ యుద్ధ భూములుగా వాడుకోచూడటం బుద్ధి తక్కువ తనం. పవిత్ర ఆలయాలను, వాటి మానాన వాటిని వదిలేద్దాం. భక్తుల మనోభావాలను గౌరవిద్దాం. అవమానపర్చడం ఆపేద్దాం. రాజకీయాలను వేరుగా చేద్దాం. ఇకిప్పుడు ఇల వైకుంఠాన్ని అకుంఠిత దీక్షతో పరిరక్షిద్దాం.

Latest News

06-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ చవితి ఉదయం 11.47 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనూరాధ రాత్రి 12.45 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సిద్ది మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి వ్యతీపాత కరణం బాలవ ఉదయం 11.47...

గా ఊల్లె.. అందరికీ ఒకటే వంట!?|ADUGU TRENDS

గా ఊల్లె నిజంగా రోజూ పండుగే? ఎవలింట్లా పొయ్యి ఎలగదు. ఊరంతటికీ ఒకటే పొయ్యి. కులం లేదు మతం లేదు. గా ఊరంతా ఒకటే కుటుంబం. రోజూ అంతా కలిసే ఉంటరు. ఒకదగ్గరనే...

గ్రామాలు బలపడితేనే దేశాభివృద్ధి!|EDITORIAL

మనది గ్రామీణ భారతం. గ్రామాలతోనే దేశం బాగుపడుతుంది. అభివృద్ధి అనగానే “ట్రిలియన్ డాలర్ ఎకానమీ”, “ఫ్యూచర్ సిటీలు” వంటి ఆకర్షణీయమైన లక్ష్యాలు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ లక్ష్యాలు సాధ్యమవ్వాలంటే గ్రామాలు బలపడటం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 05, 2026 నుండి ఏప్రిల్ 11, 2026 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా ఫలితాలు మంచిగా ఉంటాయి....

గిట్లంటే, గీ గ్యాస్ సిలండర్ మూతొత్తది!?|ADUGU TRENDS

ఇండ్లల్ల గ్యాస్ అయిపోయిందని తెల్వంగనే పక్కన పడేత్తం. కనీ, గా గ్యాస్ అయిపోయిందా? లేదా అని సూడాల్నంటే, గా మూత తీయాలె. గది తీయాల్నంటే మస్తు భయమైతది. కనీ, గా మూత తీసుడు...

యుద్ధం: వాస్తవాలు, అపోహలు, ప్రభావాలు|EDITORIAL

ప్రపంచం వేగంగా మారుతోంది. ఒక చోట చోటు చేసుకునే సంఘటనలు మరో చోట జీవన విధానాన్ని అంతకంటే వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం, ఉద్రిక్తతలు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది....

04-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు విదియ ఉదయం 08.22 వరకు ఉపరి తదియ నక్షత్రం స్వాతి రాత్రి 07.58 వరకు ఉపరి విశాఖ యోగం హర్షణ మద్యాహ్నం 01.00 వరకు ఉపరి వజ్ర కరణం గరజి ఉదయం 08.22...

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News