Monday, April 6, 2026
35.2 C
Hyderabad

యమపాశంగా ఆయిల్ గ్యాస్ బ్లోఅవుట్లు!|EDITORIAL

గోదావరి పరవళ్లు, పచ్చటి ప్రకృతి అందాలతో విరాజిల్లే కోనసీమ గత కొన్ని దశాబ్దాలుగా చమురు, సహజవాయు అన్వేషణలతో నిత్య భయాల మధ్య జీవిస్తోంది. ఓఎన్‌జీసీ అడుగుపెట్టిన నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి కన్నా ప్రమాదాలనే ఎక్కువగా చూశారు. పొలాల్లో, ఇళ్ల మధ్య, కాళ్ల కింద ఎప్పుడు పేలుతాయో తెలియని ఆయిల్‌, గ్యాస్‌ పైపులైన్లు, కోనసీమ ప్రజల జీవితంలో శాశ్వత ఆందోళనగా మారాయి. 30ఏళ్ళ క్రితం పాశర్లపూడి బ్లోఅవుట్‌ గానీ, తాజా ఇసుమండ బ్లోఅవుట్‌ గానీ, నేర్పుతున్న పాఠం ఒక్కటే. అభివృద్ధి ముసుగులో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే, ఆ మంటలు తరతరాల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆయిల్, గ్యాస్, అభివృద్ధి ఏదైనా మానవ మనుగడకే తప్ప, మానవ హననానికి కాదని గుర్తుంచుకోవాలి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

గోదావరి పరవళ్లు, పచ్చటి ప్రకృతి అందాలతో విరాజిల్లే కోనసీమ ప్రాంతం గత కొన్ని దశాబ్దాలుగా చమురు, సహజవాయు అన్వేషణలతో నిత్య భయాల మధ్య జీవిస్తోంది. దేశ ఇంధన అవసరాల కోసం ఓఎన్‌జీసీ అడుగుపెట్టిన నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి కన్నా ప్రమాదాలనే ఎక్కువగా చూశారు. పొలాల్లో, ఇళ్ల మధ్య, కాళ్ల కింద ఎప్పుడు పేలుతాయో తెలియని ఆయిల్‌, గ్యాస్‌ పైపులైన్లు, కోనసీమ ప్రజల జీవితంలో శాశ్వత ఆందోళనగా మారాయి.

1995 జనవరి 8న పాశర్లపూడిలో సంభవించిన బ్లోఅవుట్‌ ఈ ప్రాంత చరిత్రలో చెరగని విషాద ఘట్టం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బ్లోఅవుట్‌గా నమోదైన ఈ ఘటనను అదుపు చేయడానికి 65 రోజులు పట్టింది. ఆరు వేల కుటుంబాలు శిబిరాలకు తరలిపోవాల్సి వచ్చింది. పంటలు నాశనమై, పర్యావరణానికి తీరని నష్టం జరిగింది. ఆ మంటల వేడి, ఆకాశాన్ని చీల్చిన శబ్దం ఇప్పటికీ కోనసీమ వాసుల జ్ఞాపకాలలో భయానకంగా నిలిచిపోయాయి.

పాశర్లపూడి బ్లోఅవుట్‌ ఒక్కసారిగా జరిగిన ప్రమాదమేమీ కాదు. 1993లో కొమరాడ, 1997లో దేవరపల్లి, 2020లో ఉప్పూడి, ఇలా బ్లోఅవుట్‌లు తరచూ జరుగుతూనే ఉన్నాయి. 2014లో మామిడికుదురు మండలం నగరంలో గెయిల్‌ పైప్‌లైన్‌ పేలి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. కాలం చెల్లిన పైప్‌లైన్లు, నిర్వహణ లోపాలు, ప్రైవేటు సంస్థల నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
తాజాగా మలికిపురం మండలం ఇసుమండలో ఓఎన్‌జీసీ బావిలో సంభవించిన బ్లోఅవుట్‌ కోనసీమను మరోసారి కలవరపాటుకు గురిచేసింది. ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చినా, మూడు రోజులైనా మంటలు పూర్తిగా అదుపులోకి రాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వందలాది కొబ్బరి చెట్లు, వరి నారుమళ్లు, పంటలు నాశనం కావడం ఈ ప్రమాద తీవ్రతను స్పష్టం చేస్తోంది. బ్లోఅవుట్‌ భయంతో మూడు గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది.
ఇన్ని సంఘటనలు జరుగుతున్నా పాఠాలు ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? 1993లో డ్రిల్లింగ్‌ చేసిన బావిని, అధిక పీడనం ఉందని అప్పట్లోనే నిలిపివేసిన ప్రాంతాన్ని, మళ్లీ ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ఎంతవరకు సమంజసం? ప్రమాదానికి గల అసలు కారణాలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం పాలనా వైఫల్యాన్ని ప్రతిబింబిస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే హడావుడి పడటం కాదు. ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడమే చమురు సంస్థలు, నిర్వాహకులు, ప్రభుత్వాల బాధ్యత. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ఓఎన్‌జీసీ వంటి సంస్థలు ప్రజల ప్రాణాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కాలం చెల్లిన పరికరాలు తొలగించడం, కఠిన భద్రతా ప్రమాణాలు అమలు చేయడం, ప్రైవేటు సంస్థలపై కఠిన నియంత్రణ పెట్టడం అత్యవసరం. బాధితులకు తక్షణమే సముచిత నష్టపరిహారం చెల్లించడం ఇంకా అవసరం.

పాశర్లపూడి బ్లోఅవుట్‌ జరిగి మూడు దశాబ్దాలు గడిచాయి. కానీ కోనసీమ ప్రజల భయాలు ఏమాత్రం తగ్గలేదు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, మానవ నిర్లక్ష్యం ఉంటే ప్రమాదాలు తప్పవు. పాశర్లపూడి నుంచి నేటిదాకా కోనసీమ నేర్పుతున్న పాఠం ఇదే. అభివృద్ధి ముసుగులో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే, ఆ మంటలు తరతరాల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆయిల్ గ్యాస్ అయినా, అభివృద్ధి అయినా మానవ మనుగడకే తప్ప, మానవ హననానికి కాదని గుర్తుంచుకోవాలి.

Latest News

06-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ చవితి ఉదయం 11.47 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనూరాధ రాత్రి 12.45 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సిద్ది మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి వ్యతీపాత కరణం బాలవ ఉదయం 11.47...

గా ఊల్లె.. అందరికీ ఒకటే వంట!?|ADUGU TRENDS

గా ఊల్లె నిజంగా రోజూ పండుగే? ఎవలింట్లా పొయ్యి ఎలగదు. ఊరంతటికీ ఒకటే పొయ్యి. కులం లేదు మతం లేదు. గా ఊరంతా ఒకటే కుటుంబం. రోజూ అంతా కలిసే ఉంటరు. ఒకదగ్గరనే...

గ్రామాలు బలపడితేనే దేశాభివృద్ధి!|EDITORIAL

మనది గ్రామీణ భారతం. గ్రామాలతోనే దేశం బాగుపడుతుంది. అభివృద్ధి అనగానే “ట్రిలియన్ డాలర్ ఎకానమీ”, “ఫ్యూచర్ సిటీలు” వంటి ఆకర్షణీయమైన లక్ష్యాలు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ లక్ష్యాలు సాధ్యమవ్వాలంటే గ్రామాలు బలపడటం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 05, 2026 నుండి ఏప్రిల్ 11, 2026 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా ఫలితాలు మంచిగా ఉంటాయి....

గిట్లంటే, గీ గ్యాస్ సిలండర్ మూతొత్తది!?|ADUGU TRENDS

ఇండ్లల్ల గ్యాస్ అయిపోయిందని తెల్వంగనే పక్కన పడేత్తం. కనీ, గా గ్యాస్ అయిపోయిందా? లేదా అని సూడాల్నంటే, గా మూత తీయాలె. గది తీయాల్నంటే మస్తు భయమైతది. కనీ, గా మూత తీసుడు...

యుద్ధం: వాస్తవాలు, అపోహలు, ప్రభావాలు|EDITORIAL

ప్రపంచం వేగంగా మారుతోంది. ఒక చోట చోటు చేసుకునే సంఘటనలు మరో చోట జీవన విధానాన్ని అంతకంటే వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం, ఉద్రిక్తతలు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది....

04-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు విదియ ఉదయం 08.22 వరకు ఉపరి తదియ నక్షత్రం స్వాతి రాత్రి 07.58 వరకు ఉపరి విశాఖ యోగం హర్షణ మద్యాహ్నం 01.00 వరకు ఉపరి వజ్ర కరణం గరజి ఉదయం 08.22...

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News