Monday, April 6, 2026
35.2 C
Hyderabad

అమెరికా పెత్తనానికి షాంఘై సదస్సు సవాల్!|EDITORIAL

అతిగా ఆశపడి, అతిగా ఆవేశపడిన ట్రంప్, అంతకంటే అతిగానే భంగపడ్డాడు. లేని పెత్తనాన్ని నెత్తికెత్తుకుని, ప్రపంచం మీదకు కర్ర పెత్తనానికి వెళితే, ఆ కర్ర విరిగి, పుర్రె పగిలినంత పనైంది. ఇప్పటికైనా ట్రంప్ కు బుద్ధి వస్తుందా? అంటే, కొన్ని బుద్ధులు పుర్రెలతోగానీ పోవు. ఇదీ అంతే. ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారనేది సామెత. కానీ, ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు బాగా అతికిపోతుంది. అడ్డగోలుగా సుంకాల టారిఫ్‌లు పెంచి ప్రపంచాన్ని లొంగదీసుకుందామనుకున్న ట్రంప్‌కు అనూహ్యంగా ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. అవి అమెరికాను ధిక్కరించేంతగా ఉండటమే అసలైన సవాల్! యుద్ధాలను ఉసిగొల్పుతూ, అవే యుద్ధాలను ఆపేశామన్న పోజు కొట్టి, శాంతి నోబెల్ ప్రైజ్ కొట్టేయాలన్న ట్రంటు తలంపు, ఇప్పుడాయనకు శాంతి లేకుండా చేస్తోంది. ట్రంపు సుంకాలను తొలుత చైనా గట్టిగానే ఎదిరించింది. ఎదురు సుంకాలు విధించింది. ఇప్పుడు భారత్‌ కూడా సరిగ్గా అలాగే చేసింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును అడ్డం పెట్టుకుని మనల్ని లొంగదీసుకుని, ఏకాకిని చేయాలనుకున్న అమెరికా ఇప్పుడు ఏకాకి అయింది. షాంఘై సదస్సు తరవాత ట్రంప్‌లో అసహనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. భారత్‌, చైనా, రష్యాలు ఏకమయ్యాయని, భారత్‌ను దూరం చేసుకున్నానని వలపోస్తున్నాడు. భారత్‌ మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా సమాధానం ఇస్తోంది.
భారత్‌ తలచుకుంటే అమెరికా దెబ్బతినడం ఖాయం. అక్కడ ఉన్న టెకీలు భారత్‌కు తిరిగివస్తే నష్టపోయేది అమెరికాయే. మొన్నటి ఎన్నికల్లో ఎన్నారైలు అంతా గంపగుత్తగా ట్రంప్‌కు ఓటేశారు. ఈ కృతజ్ఞత కూడా ట్రంప్‌కు లేకుండా పోయింది. టెకీలపై ఆంక్షలు విధిస్తున్నాడు. అచ్చోసిన ఆంబోతులా సుంకాల టారిఫ్‌ ల దాడికి దిగాడు. ఈ సమయంలోనే తియాన్‌జిన్‌ సమావేశం ట్రంప్‌ గాయంపై కారం చల్లినట్లైంది. అత్యధిక జనాభా కలిగిన భారత్, రష్యా, చైనా దేశాలు ఐక్యతను చాటాయి. ట్రంప్‌ టారిఫ్‌లపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా విరుచుకు పడ్డారు. చైనా, భారత్‌ లాంటి దేశాలను దూరం చేసుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
షాంఘై సదస్సు ఏం సాధించిందన్న దానికి ట్రంప్‌ అంతర్మథనమే అద్దం పడుతోంది. ఈ మార్పు నిస్సందేహంగా ఒక బహుళ ధృవ ప్రపంచం అవసరాన్ని తెరపైకి తీసుకుని వచ్చింది. తియాన్‌ జిన్‌ రేవు పట్టణం షాంఘై సహకార సమితి శిఖరాగ్ర సమావేశానికి ఘనంగా ఆతిథ్యమిచ్చింది. ఎస్‌.సి.వో తన పరిధిని విస్తరించుకుని ఆర్థిక సహకారం, సాంస్కృతిక సంబంధాలు, ఇంధన రంగాలను కూడా చేర్చుకుంది. 21వ శతాబ్ది సవాళ్లనూ అవకాశాలను ఎస్‌.సి.వో స్వీకరించింది.
ట్రంప్‌ ఉన్మాదపూరితంగా మాట్లాడుతున్నాడు. భారత ఆర్థిక వ్యవస్థ నిర్జీవంగా ఉందనీ, దాంతో వ్యాపారం చేయడమంటే కోరి వినాశనం కొని తెచ్చుకోవడమేననీ నోరు పారేసుకున్నాడు. పాక్ తో భారత్ సైనిక ఘర్షణల విరమణలో తన పాత్రకు తగిన గుర్తింపునివ్వలేదని కూడా ట్రంప్‌ కుదేలైపోయాడు. రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడానికి భారతే కారణమనేంత వరకూ వెళ్లారు. భారత్‌ను లొంగదీసు కోవడమే ఇక్కడ అమెరికా ప్రధానోద్దేశం.
ఇక బహుళ ధృవ ప్రపంచ దృశ్యం, సామర్థ్యం, సత్తా ఏమిటో తియాన్‌జిన్‌ చూపెట్టింది. జిన్‌పింగ్‌, వ్లాదిమిర్‌ పుతిన్‌, నరేంద్ర మోదీలు కలిసి పాల్గొనటం, సుస్థిర ప్రపంచ వ్యవస్థను నొక్కి చెప్పింది. ప్రాంతీయ, ప్రపంచ భద్రతపై ఎస్‌.సి.వో దృష్టిని కేంద్రీకరించింది. ఇజ్రాయిల్‌, అమెరికాల సైనిక దాడులను తీవ్రంగా ఖండించింది. అవి అంతర్జాతీయ చట్టాలనూ ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘించేవిగా వున్నాయి. ఇరాన్‌ సార్వభౌమాధికారానికి తూట్లు పొడిచేవిగా జరిగాయని పేర్కొంది. తియాన్‌జిన్‌ సమావేశానికి ముందు మోదీ, జిన్‌పింగ్‌లు శిఖరాగ్ర సమావేశం జరిపినప్పుడే గాలి ఎటు వీస్తున్నదీ స్పష్టమైపోయింది. భారత్‌, చైనాలు భాగస్వాము లేగానీ విరోధులు కాదన్నది ఉమ్మడి స్ఫూర్తిగా వచ్చిన ప్రధాన సందేశం. బహుళ ధృవ ప్రపంచం, వాణిజ్య స్వేచ్ఛను ప్రముఖంగా చెబుతూ న్యాయమైన, సహేతుకమైన పరస్పర అంగీకార యోగ్యమైన పరిష్కారాలను కనుగొనాలని ఈ రెండు దేశాలు అవగాహనకు వచ్చాయి. విధానపరమైన స్వీయ నిర్ణయాధికారాన్ని ఇరు దేశాలు పాటిస్తాయి. ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకునే దిశలో బహుముఖ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని జిన్‌పింగ్‌ పేర్కాన్నారు. భారత్‌, చైనా సంబంధాలను సరిహద్దు సమస్యను బట్టి మాత్రమే నిర్ణయించరాదని కూడా ఆయన చెప్పారు. విశాల భౌగోళిక దృష్టితో భారతదేశ ప్రయోజనాలను ట్రంప్‌ చూడటం లేదని తేలిపోయింది. ఆసియాలో బలాబలాల సమతుల్యతకు సంబంధించి భారత దేశం విలువేమిటో ఆయనకు తెలియలేదని అర్థమై పోయింది. భారత అమెరికా సంబంధాలను గమనిస్తున్న వారికి మాత్రం ఇది పెద్ద ఆశ్చర్యం కలిగించదు. ఇది ఎప్పుడో జరగవలసి వున్నదే.
ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత, కాల్పుల విరమణకు తానే కారణమంటూ ఉన్మాదంగా ట్రంప్‌ ఏకపక్షంగా చెప్పుకోవడం ట్రంప్‌ టెంపరితనాన్ని ప్రపంచానికి చాటింది. ఇండియా, పాక్ లను ఒకే గాటనకట్టి చూడటం ట్రంప్‌ సంకుంచితత్వానికి పరాకాష్ట. వాణిజ్యంలో అమెరికాపై ఆధారపడకపోతే కలిగే నష్టాలను తట్టుకోవడానికి భారత్‌ సిద్దం కావాలి. దీనికి స్వదేశీ నినాదమొక్కటే మార్గం.

Latest News

06-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ చవితి ఉదయం 11.47 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనూరాధ రాత్రి 12.45 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సిద్ది మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి వ్యతీపాత కరణం బాలవ ఉదయం 11.47...

గా ఊల్లె.. అందరికీ ఒకటే వంట!?|ADUGU TRENDS

గా ఊల్లె నిజంగా రోజూ పండుగే? ఎవలింట్లా పొయ్యి ఎలగదు. ఊరంతటికీ ఒకటే పొయ్యి. కులం లేదు మతం లేదు. గా ఊరంతా ఒకటే కుటుంబం. రోజూ అంతా కలిసే ఉంటరు. ఒకదగ్గరనే...

గ్రామాలు బలపడితేనే దేశాభివృద్ధి!|EDITORIAL

మనది గ్రామీణ భారతం. గ్రామాలతోనే దేశం బాగుపడుతుంది. అభివృద్ధి అనగానే “ట్రిలియన్ డాలర్ ఎకానమీ”, “ఫ్యూచర్ సిటీలు” వంటి ఆకర్షణీయమైన లక్ష్యాలు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ లక్ష్యాలు సాధ్యమవ్వాలంటే గ్రామాలు బలపడటం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 05, 2026 నుండి ఏప్రిల్ 11, 2026 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా ఫలితాలు మంచిగా ఉంటాయి....

గిట్లంటే, గీ గ్యాస్ సిలండర్ మూతొత్తది!?|ADUGU TRENDS

ఇండ్లల్ల గ్యాస్ అయిపోయిందని తెల్వంగనే పక్కన పడేత్తం. కనీ, గా గ్యాస్ అయిపోయిందా? లేదా అని సూడాల్నంటే, గా మూత తీయాలె. గది తీయాల్నంటే మస్తు భయమైతది. కనీ, గా మూత తీసుడు...

యుద్ధం: వాస్తవాలు, అపోహలు, ప్రభావాలు|EDITORIAL

ప్రపంచం వేగంగా మారుతోంది. ఒక చోట చోటు చేసుకునే సంఘటనలు మరో చోట జీవన విధానాన్ని అంతకంటే వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం, ఉద్రిక్తతలు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది....

04-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు విదియ ఉదయం 08.22 వరకు ఉపరి తదియ నక్షత్రం స్వాతి రాత్రి 07.58 వరకు ఉపరి విశాఖ యోగం హర్షణ మద్యాహ్నం 01.00 వరకు ఉపరి వజ్ర కరణం గరజి ఉదయం 08.22...

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News