ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు కోర్టు సినీ నటుడు పోసాని కృష్ణమురళి కి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజంపేట సబ్ జైలుకు తీసుకెళ్లారు. పోలీసులు నిన్న రాత్రి 09 గంటల వరకువిచారించి నేరుగా 9.30 గంటలకు జడ్జీ ముందు హాజరుపరిచారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సుదీర్ఘంగా 7 గంటల పాటు వాదనలు కొనసాగాయి. ఇరు పక్షాల వాదనల అనంతరం పోసాని కి 14 రోజుల రిమాండ్ విధించింది. మేజిస్ట్రేట్ ముందు పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పోసాని పై బీఎన్ఎస్ సెక్షన్ 111(1), సెక్షన్ 196(1), సెక్షన్ 79, సెక్షన్ 192, ఐపీసీలోని 354 ఏ1(4), 505(1) (సీ) సెక్షన్ల కింద పోసాని పై కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు లైంగిక వేధింపుల కిందకే వస్తాయని కోర్టు తెలిపింది. ఆ తరువాత రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఇదే విషయమై పోలీసు కస్టడీ కావాలని కోరుతూ ఈ పోలీసులు కోర్టులో పిటిషన్ వేయగా ఈ రోజు వాదనలు కొనసాగనున్నాయి. అలాగే పోసాని కృష్ణమురళి తరుపున న్యాయవాదులు కోర్టు జడ్జిమెంటును సవాల్ చేస్తూ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు సమాచారం.

