మహాకుంభమేళాపై దేశంలో నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మహాకుంభమేళాపై పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేయడం మన నాయకులకు చాలా సులువు అయిపోయింది. వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు వేరే మతాలపై చేయరు. ఇవి కోట్ల మంది విశ్వాసాలను దెబ్బతిస్తాయని వారు తెలుసుకోవట్లేదు. లక్షలాది ప్రజలు ఓ చోటుకు చేరినప్పుడు కఠిన సవాళ్లు ఎదురవుతాయి. అలా అని అనుకోని, విచారకర ఘటనలు జరగాలని కోరుకోం కదా’ అని పవన్ సీరియస్ గా అన్నారు.

