ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు సతీమణి అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరా, డైరెక్టర్ త్రివిక్రమ్ తో వెళ్లి అక్కడ పవిత్ర స్నానం ఆచరించారు. అంతకుముందు త్రివేణీ సంగమం వద్ద గంగా మాతకు హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. మహాకుంభమేళాలో పాల్గొనడం అందరికీ గొప్ప అవకాశం అని పవన్ చెప్పారు. ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

