ఏపీ మంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివేదిక విడుదల చేశారు. ఏపీ క్యాబినెట్‌లో మొత్తం 25 మంది మంత్రులు ఉండగా, వారు తమ శాఖలకు సంబంధించిన ఫైళ్లను ఎంత వేగంగా క్లియర్ చేస్తున్నారనే అంశంపై ఈ ర్యాంకులను నిర్ణయించారు. ఈ నివేదిక ప్రకారం, మైనార్టీ మంత్రిగా ఉన్న ఫరూఖ్ తొలి స్థానంలో నిలవగా, చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో వెనుకబడిన మంత్రులు మరింత వేగంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
మంత్రుల పనితీరు ఆధారంగా కేటాయించిన ర్యాంకులు ఇలా ఉన్నాయి:
- ఫరూఖ్
- కందుల దుర్గేష్
- కొండపల్లి శ్రీనివాస్
- నాదెండ్ల మనోహర్
- నారా చంద్రబాబు నాయుడు
- డోలా బాలవీరాంజనేయస్వామి
- సత్యకుమార్
- నారా లోకేష్
- బీసీ జనార్ధన్ రెడ్డి
- పవన్ కల్యాణ్
- సవిత
- కొల్లు రవీంద్ర
- గొట్టిపాటి రవికుమార్
- నారాయణ
- టీజీ భరత్
- ఆనం రామనారాయణరెడ్డి
- అచ్చెన్నాయుడు
- రాంప్రసాద్ రెడ్డి
- సంధ్యారాణి
- వంగలపూడి అనిత
- అనగాని సత్యప్రసాద్
- నిమ్మల రామానాయుడు
- కొలుసు పార్ధసారధి
- పయ్యావుల కేశవ్
- వాసంశెట్టి సుభాష్
కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రుల్లో, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 10వ స్థానంలో నిలవగా, విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 8వ స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా 5వ స్థానాన్ని పొందారు. ఈ ర్యాంకులు మంత్రుల పనితీరు మెరుగుపరచేందుకు ప్రేరణగా మారాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఫైళ్లను సమర్థవంతంగా క్లియర్ చేసి, ప్రజలకు హామీలను అమలు చేయడంలో తగిన బాధ్యత చూపాలని సూచించారు.

