ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
లైంగిక వేధింపుల గురించి భయంతో ఉన్న విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేశారు. ఈ సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కోపంతో పాఠశాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.గ్రామస్తులు ఆగ్రహంతో ఉపాధ్యాయుడిని పాఠశాలలో బంధించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
సమాచారం అందుకున్న పోలీసులు, మండల విద్యాధికారి తైమూరు భాష, ఇతర అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. ఉపాధ్యాయులుగా ఉండి విద్యార్థులను రక్షించాల్సిన వారు ఇలాంటి దారుణాలకు పాల్పడటం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

