ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం APSP బెటాలియన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర హోం శాఖ ప్రకటించిన ప్రకారం, APSP బెటాలియన్లకు కొత్తగా మంగళగిరి మరియు కర్నూలు కేంద్రాలుగా డీఐజీలను నియమించింది.
మంగళగిరి విఐజి పరిధి:
మంగళగిరి డీఐజి పరిధిలో ఎచ్చెర్ల, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయనగరం, మంగళగిరి, మద్దిపాడు, విశాఖపట్నం బెటాలియన్లు చేర్చబడ్డాయి.
కర్నూలు SAR CPL పరిధి:
కర్నూలు SAR CPL పరిధిలో కర్నూలు, చిత్తూరు, వెంకటగిరి, కడప, అనంతపురం బెటాలియన్లను చేర్చినట్టు హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి అమలులోకి రావడానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇప్పటికే విడుదలయ్యాయి.

