ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన టీమ్ తీవ్రంగా ఖండించింది. కొద్ది యూట్యూబ్ ఛానళ్లు నిరాధార ఆరోపణలు చేస్తూ, ఆయన గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నాయని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ముఖ్యంగా ఆస్తులు, పారితోషికాలపై అవాస్తవాలు సృష్టిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని గరికపాటి టీమ్ పేర్కొంది. ఈ ఆరోపణలు ఆయన కుటుంబసభ్యులు, అభిమానులను కలచివేస్తున్నాయని, ఇలాంటి ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం సృష్టించే వ్యక్తులు, ఛానళ్లపై క్రిమినల్ కేసులు, పరువు నష్టం దావాలు వేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఆగకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

