తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల వినియోగంపై వివాదం చెలరేగింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు అనుమతులు లేవని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. అలాగే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) దృష్టికి కూడాతీసుకెళ్లాలని సూచించారు. అదనంగా, గోదావరి బోర్డు మరియు కేంద్ర జలశక్తి శాఖకు అభ్యంతరాలను తెలియజేస్తూ లేఖలు రాయాలని ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం మరింత తీవ్రతరం కావచ్చు.

