తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మెదక్ చర్చిలో జరిగిన క్రిస్మస్ ప్రార్థనల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో పులివెందుల లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో వైయస్సార్ సిపి అధ్యక్షులు మాజీ సీఎం జగన్ పాల్గొన్నారు అలాగే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చర్చిలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

