తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ తల్లి సరస్వతి మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేసింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన కుమారుడు కౌశిక్‌కు వైద్య సాయం చేస్తానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినప్పటికీ, ఆయన మాట తప్పారు అని తెలిపింది. “దేవర” చిత్ర విడుదల ముందు ఎన్టీఆర్, సరస్వతితో, కౌశిక్‌తో వీడియో కాల్ చేసి, వైద్యం కోసం డబ్బులు అందిస్తానని హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటివరకు ఎన్టీఆర్ నుంచి ఏ విధమైన ఆర్థిక సాయం అందలేదు అని తన భాదను వ్యక్తం చేశారు. ప్రస్తుతం కౌశిక్ చెన్నైలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పూర్తయింది, ప్రభుత్వం నుండి 11 లక్షలు టిటిడి నుండి 40 లక్షలు ఆర్థిక సాయం అందినప్పటికి ఇంకా 20 లక్షలు చెల్లించాలని ఆసుపత్రి కోరుతోంది, ఇప్పటికైనా జూనియర్ ఎన్టిఆర్ గారిని ఆర్థిక సహాయం అందించండి అని కౌశిక్ తల్లి వేడుకుంటుంది.

