మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మోహన్‌బాబు మీద రాచకొండ పోలీస్ స్టేషన్‌లో జర్నలిస్టు పై దాడి చేయడంతో హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసు నేపథ్యంలో మోహన్‌బాబు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై గతంలో హైకోర్టులో విచారణ జరిగింది. తాజాగా, ఈ రోజు మరోసారి దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి, రెండు వర్గాల వాదనలు శ్రద్ధగా విన్న తర్వాత మోహన్‌బాబుకు బెయిల్ మంజూరు చేయాలన్న పిటిషన్‌ను కొట్టివేశారు. ఈ నిర్ణయంతో మంచు మోహన్‌బాబు కు షాక్ గా చెప్పవచ్చు.

