ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. చమోలి – బద్రినాథ్ హైవేపై గ్లేసియర్ (హిమానీనదం) బరస్ట్ అయింది. దీంతో 57 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు మంచులో కూరుకుపోయారు. వారిలో 10 మందిని రక్షించగా, 47 మంది ఆచూకీ దొరకలేదు. సహాయక చర్యల కోసం SDRF, NDRF బృందాలు రంగంలోకి దిగాయి . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని రోజులుగా అక్కడ భారీగా మంచు కురుస్తోంది.

