కుటుంబంలో కలహాలు ఏమీ లేవు
కలహాలు ఉన్నాయని ప్రచారం చేయడం ప్రతిపక్షాల కుట్ర
మేమంతా కలిసే ఉన్నాం
నిన్న ఒక మీడియా ఛానల్లో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయని ప్రచారం చేయడం సరైనది కాదని డిసిసిబి డైరెక్టర్, పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరి ప్రసాదరావు సీనియర్ నాయకులు రామసహాయం కిషోర్ రెడ్డి అన్నారు. నిన్న ఒక చానల్లో తమపై జరిగిన తప్పుడు ప్రచారంపై తొర్రూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ ప్రచారాలన్నీ తప్పని వారు ఖండించారు. పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఎప్పుడు కలిసే ఉంటుందని, మమ్మల్ని బలహీనం చేయడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు కుట్ర పడుతున్నాయని దుయ్యబట్టారు. మాకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డికి మధ్య ఎటువంటి వివాదాలు లేవన్నారు. అవన్నీ ప్రతిపక్షాల కల్పితాలని, అవాస్తవమని చెప్పారు. ఝాన్సమ్మ మాకు సోదరి అని, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని కుండబద్దలు కొట్టారు. మాకు ఎలాంటి వర్గాలు లేవని, మాకు ఉన్నది ఒకే ఒక వర్గం కాంగ్రెస్ పార్టీ వర్గమని చెప్పారు. పాత, కొత్త క్యాడర్ అనే సమస్య ప్రతి పార్టీలో ఉంటుందని, ఎప్పటినుంచో పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకే మొదలు పదవులు ఇవ్వమని మేము ముక్తకంఠంతో వివరించామని చెప్పారు. గత రెండు మూడు నెలలుగా మేము ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి లను కలవలేదని ప్రచారం చేస్తున్నారని, గత వారం క్రితం తాను, నిన్న కూడా రామసహాయం కిషోర్ రెడ్డిలు కలిసామని, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి వారితో అనేక చర్చలు చేశామని చెప్పారు. ఆరు మండలాల్లో అందరం కలిసిమెలిసి ఉన్నామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆరు జడ్పిటిసిలు 6 ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు అన్నీ కూడా భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మా మధ్య విభేదాలే ఉంటే ఈరోజు నియోజకవర్గ స్థాయి నాయకులమంతా కలిసి మీడియా సమావేశం ఎందుకు పెడుతమని ప్రశ్నించారు. దయచేసి మీడియా వారు కూడా ఉన్నది ఉన్నట్లు రాయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నెహ్రూ నాయక్, రాఘవరావు, గంజి విజయపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హమ్య నాయక్, మండల అధ్యక్షులు సుంచు సంతోష్, పట్టణ అధ్యక్షులు సోమరాజశేఖర్, పెదగాని సోమన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ రామచంద్రం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగు సురేందర్ రెడ్డి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

