మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు ప్రవేశించనున్నారని సంకేతాలు వస్తున్నాయి. జూలైలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానం నుండి కమల్ హాసన్ డిఎంకె టికెట్ పై పోటీ చేయనున్నారు.
ఈ విషయంపై చర్చించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సూచనల మేరకు, మంత్రి శేఖర్ బాబు కమల్ హాసన్ ని కలిశారు. డిఎంకెతో ఒప్పందం ప్రకారం, కమల్ హాసన్ 2024 లోక్సభ ఎన్నికల్లో మక్కల్ నీతి మయ్యం అభ్యర్థిగా పోటీ చేయకూడదని నిర్ణయించారు. ఈ క్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పోటీ చేసే కోయంబత్తూరు నియోజకవర్గంలో కమల్ పోటీ చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ, డిఎంకె డిమాండ్ ప్రకారం కమల్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
ఈ ఒప్పందం కింద, డిఎంకె కమల్ హాసన్ కు రాజ్యసభ సీటు ఆఫర్ చేసింది. ప్రస్తుతం డిఎంకె రాజ్యసభలో నలుగురు సభ్యులను గెలిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మక్కల్ నీది మయ్యం నుండి కమల్ హాసన్నే పరిగణనలోకి తీసుకుంటామని డిఎంకె ప్రకటించింది.

