ఇండ్ల నిర్మాణాల్లో అక్రమాలను నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి నిర్మాణం ప్రారంభం నుండి పూర్తి అయ్యే వరకు శాటిలైట్ సేవలు మరియు AI టెక్నాలజీని వినియోగించనుంది. నిర్మాణ స్థలంలోని అక్షాంశ, రేఖాంశ సంఖ్యలను ఖరారు చేసి, శాటిలైట్ సిస్టమ్‌కు అనుసంధానం చేయబడుతుంది. ఈ విధంగా నిర్మాణాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పరిశీలించవచ్చు. అలాగే, నిర్మాణానికి సంబంధించిన ఫొటోలు అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే అర్హులు బిల్లులు అందుకుంటారు.

