తెలంగాణ ప్రభుత్వానికి డెడికేటెడ్ బీసీ కమిషన్ 700 పేజీలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా రాజకీయ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. పంచాయతీ రాజ్ శాఖ చట్టం ప్రకారం, గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ఎంపీటీసీ రిజర్వేషన్లు, జిల్లాను యూనిట్‌గా తీసుకుని ZPTC రిజర్వేషన్లు కేటాయించనున్నారు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ZP ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఈ కమిషన్ నివేదిక త్వరలో ప్రభుత్వానికి రిజర్వేషన్ అమలుపై ముఖ్యమైన మార్గదర్శకాలను అందించనుంది.

