ఒడిశా సాంస్కృతిక సంపదను పరిచయం చేసేందుకు శిల్పారామంలో మూడు రోజుల పాటు ఒడిశా ఫుడ్ & క్రాఫ్ట్ మేళా నిర్వహించనున్నారు. స్వాభిమాన్ ఒడియా ఉమెన్స్ వరల్డ్ & శిల్పారామం సంయుక్తంగా ఈ మేళాను శుక్రవారం ప్రారంభించనున్నాయి. ఈ కార్యక్రమంలో ఒడిశా సంప్రదాయ వంటకాలు, హస్తకళ ఉత్పత్తులు ప్రదర్శన జరుగుతుంది. ఈ మేళా జరిగే రోజుల్లో ఒడిశా సంప్రదాయ నృత్యం, జానపద, గిరిజన నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

