రాష్ట్రంలో కొత్తగా 10 చేనేత క్లస్టర్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక్కొక్క క్లస్టర్, తిరుపతిలో రెండు క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. తొలిదశలో గుంటూరు, బాపట్ల, పల్నాడు, తిరుపతికి రూ.5 కోట్లు విడుదల చేయగా, మిగతా క్లస్టర్లకు రూ.2 కోట్లు త్వరలో విడుదల కానున్నాయి. సంక్రాంతి నాటికి ఈ క్లస్టర్ల పనులు ప్రారంభం కానుండగా, 2వేల మంది చేనేతలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. చేనేత డిజైన్ల అభివృద్ధి ద్వారా వారి ఆదాయాన్ని పెంచే దిశగా ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది.

