ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల పొయ్యి గోస మొదలాయే. గీ గోసలతోటి గిట్ల పని కాదని, రకరకాల పొయ్యిలు సేసే ఉపాయాలు మొదలైనయి. గట్లనే గిప్పుడు ఒకాయినె మంచి నూనె పీపాను కట్టెల పొయ్యి లెక్క పెద్దగ సేసిండు. ఇగ గిది పెద్ద పెద్ద వంటలకు బాగుటందన్నట్లు.

మన ఇంట్ల వాడి పడేసిన నూనె పీపాను తీసుకున్నడు. గదాని మూత కెల్లి కోసిండు. గట్లనే పీపా సక్కగా వుండే సైడు ఒడుపుగ నాలుగు మూలలు కోసిండు. ఇగ గిన్నెలు పెట్టుకుంటట్లు, మూత తీసిన సైడు కట్టెలు పెట్టేటట్లు సేసి గదాన్ని పొయ్యిగ మార్సిండు. ఇగ గదాతోటి మసి రాదు… బండలు కరాబ్ గావు. మస్తున్నది కదా గీ కొత్త పొయ్యి?

