విచారణకు వెళితే ‘IMAGE|ఇమేజీ’ ‘డ్యామే’జీ|DAMAGE అవుతుందా?
వ్యక్తిగత ప్రతిష్ట, PARTY|పార్టీ పరువు పోతుందా?
హాజరవడానికి ‘అహం’ అడ్డు వస్తోందా?
బోనెక్కకుండా బయట పడటమెలా?
LEGAL|లీగల్ TEAM|టీమ్ ద్వారా వివరణ ఇస్తే సరా?
చివరిదాకా గడువు పెంచుతూ పోవచ్చా?
కాళేశ్వరంపై కేసీఆర్ ‘వ్యూ’హం ఏంటి?
JUNE|జూన్ లో రాష్ట్రం అవతరించింది. జూన్ లోనే కేసీఆర్ CM|సీఎంగా ప్రమాణం చేశారు. ఇప్పుడు అదే జూన్ లోనే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ కమిషన్ ముందు హాజరు కావాల్సిన అగత్యం వచ్చింది. ఇప్పుడీ విచారణ కమిషన్ బోనెక్కడమా? విచారణ కమిషన్ ముందు హాజరునుంచి తప్పించుకోవడం ఎలా? అన్నదే ప్రధాన సమస్య.
KALESHWARAM|కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేస్తున్న జస్టిస్ ఘోష్ కమిషన్ తాకీదులివ్వటం కేసీఆర్ కు తల తీసేసినంత పనైంది. ఎవ్వరైనా తన ఎదుట హాజరవటమే తప్ప తాను ఎవ్వరి ఎదుటా హాజరాకావడానికి ఏ మాత్రం ఇష్టపడని కేసీఆర్, ఇప్పుడేం చేయాలనే ఆలోచన చేస్తున్నారట. హాజరనేదే లేకుండా ఏం చేయాలి? హజరైతే ఏంటి? కాకపోతే ఏంటి? పరువు పోతుందా? వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుందా? పార్టీ పరిస్థితి ఏం కాను? ఇప్పటికే విజిలెన్స్ రిపోర్టు అనేక మందిని దోషులుగా తేల్చి చర్యలకు సిఫారసు చేసింది. మరోవైపు కమిషన్ విచారణకు పిలిచింది. అందుకే కేసీఆర్ అనేక విధాలుగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నారట. సాధ్యమైనంత వరకు హాజరు మినహాయింపు, లేదంటే తన పార్టీ కేడర్, లీడర్స్ మొత్తాన్ని మోహరించడం వంటి ఆలోచనలు కూడా చేస్తున్నారట.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విచారణ వేగం పెరిగింది. కమిషన్ తన దూకుడును పెంచింది. ఒకవైపు విజిలెన్స్ రిపోర్టు, మరోవైపు ఎన్డీఎస్ఎ నివేదిక, ఇంకోవైపు పీసీ ఘోష్ కమిషన్ విచారణ, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు HARISHRAO|హరీశ్ రావు, EATALA RAJENDER|ఈటల రాజేందర్ లకు కమిషన్ ఎదుట హాజరు కావాలని నోటీసులు, ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన ఎల్ అండ్ డి సంస్థపై, 57 మంది ఇంజనీరింగ్ అధికారులపై క్రిమినల్ చర్యలు, జరిమానాలు, రికవరీకి విజిలెన్స్ ప్రభుత్వానికి సిఫారసులు. ఒకదాని తర్వాత ఒకటి చొప్పున అన్నీ ఒకేసారి కలిసి కట్టకట్టుకుని వచ్చాయి. దీంతో కాళేశ్వరం విచారణ చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అన్నీ తానై నిర్మింప చేసిన కలల ప్రాజెక్టు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి, ‘యస్..ఐ యామ్ ఆన్ రికార్డ్’ అంటూ ఆ ప్రాజెక్టుపై తన సాధికారతను కూడా నిరూపించుకున్నారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ఎంత చెప్పినా, కేంద్రం పట్టించుకోలేదు. పైగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి అవసరమైన నిబంధనలేవీ పాటించలేదని, అనుమతులు తీసుకోలేదని, డీపీఆర్ కూడా లేదని అనేక కొర్రీలు కేంద్రం పెట్టింది. దీంతో ఏకపక్షంగా ఏకంగా లక్ష కోట్లకు పైగా ప్రజా ధనాన్ని ఖర్చు చేసి, ప్రపంచంలోనే అతి పెద్దదిగా, అతి తక్కువ కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, పటిష్టంగా ఆ ప్రాజెక్టు నిర్మాణం అయిపోయిందని ప్రకటించారు.సరిగ్గా ఎన్నికల ముంగిట ఆ ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద కుంగిపోయింది. పగుళ్ళువారింది. ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. ఆ ఎన్నికల్లో కేసీఆర్ ను ప్రజలు తిరస్కరించారు. తాజా కాస్తా మాజీ అయిపోయారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నిర్మాణాల లోపాలపై విచారణ కోసం సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ చైర్మన్ గా కమిషన్ ను నియమించింది. అయితే 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తర్వాత అనివార్యంగా ప్రభుత్వం, కమిషన్ గడువును పెంచుతూ వస్తున్నది. విచారణలో అధికారులంతా ఆనాటి ప్రభుత్వ పెద్దలవైపే వేలు చూపించడంతో రాజకీయ జోక్యంపై కూడా విచారణ అవసరం అని భావించి, తాజాగా జూలై 31వ తేదీ వరకు కమిషన్ గడువును మరోసారి పొడిగించింది.
ఇదే తరుణంలో కమిషన్ మే మూడో వారంలో అప్పటి సీఎం, కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ లకు నోటీసులు ఇచ్చింది. 5న కేసీఆర్ ను, 6న హరీశ్ రావును, 9న ఈటలను హాజరు కావాలని ఆదేశించింది. నోటీసులు అందిన రెండు రోజుల్లోనే డాడీకి డాటర్ రాసిన లేఖ లీకు దుమారం లేచింది. మరోవైపు కేసీఆర్ నోటీసుల విషయంలో అనేక మార్లు కేటీఆర్, హరీశ్ రావు, న్యాయనిపుణులతో చర్చోపచర్చలు జరిపారు.
ఈలోగా ఆ ప్రాజెక్టులో విజిలెన్స్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి 57మంది అధికారులను బాధ్యులుగా విజిలెన్స్ తేల్చింది. 17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించింది. 33 మంది ఇంజనీర్లపై జరిమానా విధించాలని, 7 గురు రిటైర్డ్ ఇంజనీర్లపై ఐపీసీ సెక్షన్లు 120 (B), 336, 409, 418, 423, 426, 1988 ఆనకట్ట భద్రతా చట్టం, PDPP చట్టం, 1984 ప్రకారం వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చింది. పేర్లతో సహా వారి వివరాలను అందులో పేర్కొంది.
విచారణకు వెళితే ‘ఇమేజీ’ ‘డ్యామే’జీ అవుతుందా?
సరిగ్గా ఈ దశలో మాజీ సీఎం కేసీఆర్ విచారణ విషయంలో విచారంలో పడ్డారు. విచారణకు వెళితే ఏంటి? వెళ్ళకపోతే ఏంటి? ఇంత కాలంగా భద్రంగా నిర్మించుకున్న తన ‘ఇమేజీ’ ‘డ్యామే’జీ అవడం ఖాయంగా భావిస్తున్నారు. కమిషన్ ఎదుట హాజరవడమంటే కోర్టుకు హాజరవడానికి దాదాపు సమానమే. సగౌరవంగా అహ్వానించి అడగడమైనా, ప్రశ్నించడమే? నిలదీయడమే? ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ఆరా తీయడమే. ఇప్పుడు కేసీఆర్ కు ఇదే సమస్యగా మారిందిట. ప్రశ్నించడమే తప్ప, ప్రశ్నలు ఎదుర్కోవడానికి ఏ మాత్రం కేసీఆర్ ఇష్టపడరు. సీఎంగా ఉన్నప్పుడు విలేకరులు ప్రశ్నిస్తే ప్రశ్నలతోనే చేసిన ఎదురుదాడులు ఇప్పటికీ యూట్యూబ్ లో చూడొచ్చు. ఆయన చెప్పింది వినాలె అంతే.
వ్యక్తిగత ప్రతిష్ట, పార్టీ పరువు పోతుందా?
ఇప్పుడు కేసీఆర్ కు సంకటంగా మారింది ఇదే. ఒకవైపు ఉద్యమాలు, సుదీర్ఘ రాజకీయ, పరిపాలన, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి, రాష్ట్ర సీఎం వంటి ఎన్నో పదవుల అనుభవం ఆయన్ని ఎదురులేని నేతగా మార్చాయి. రాజకీయ జీవితారంభానికి ముందు ‘దుబాయ్ శేఖర్’ గా ముద్ర పడిన రోజుల్లోనూ ఆయన విమర్శలను ఎదుర్కొన్నారే తప్ప, విచారణలు ఎదుర్కోలేదు. పైగా క్రుష్ణా, రామా అనుకోవాల్సిన ఈ వయసులో ఇదేంటి? విచారణకు వెళితే, తన వ్యక్తిగత ప్రతిష్ట ఏంటి? పరువేం కాను? అన్న మీమాంసలో సారు ఉన్నారట.
హాజరవడానికి ‘అహం’ అడ్డు వస్తోందా?
సాధారణంగా కేసీఆర్ ధిక్కార స్వరాన్ని అంగీకరించరు. తాను ధిక్కరించే ఈ స్థాయికి చేరుకున్నారు. అది వేరు. అయినా అందులో తప్పులేదు. అది ఆయన వ్యక్తిత్వం. తనకు రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ ను, గురువు మదన్ మోహన్ ను, మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబును ధిక్కరించే కదా ఆయన టిఆర్ఎస్ ను పెట్టారు. ఆంధ్రాపాలకులను ధిక్కరించే కదా ఆయన ఉద్యమబాట పట్టారు. ఎన్టీఆర్ ను బాగా అభిమానించే కేసీఆర్, ఆయన లాగే ‘అహం బ్రహ్మస్మి’ అనే బాపతే. ఇప్పుడా అహమే విచారణ కమిషన్ ఎదుట హాజరవడానికి అడ్డు వస్తుందట.
బోనెక్కకుండా బయట పడటమెలా?
అసలు బోనెక్కకుండా బయట పడలేమా? అనేది ప్రస్తుం కేసీఆర్ ఆలోచన అని ఆయనకు అత్యంత సన్నిహితులు, ఆయనతో బాగ పరిచయం ఉన్న నేతలు చెబుతున్నమాట. ఆ కారణంగానే ఆయన సుదీర్ఘంగా న్యాయనిపుణులతో చర్చోపచర్చలు చేస్తున్నారట. ఇప్పుడు జూన్ 11కు సమయం తీసుకుంది కూడా అందుకేనట.
లీగల్ టీమ్ ద్వారా వివరణ ఇస్తే సరా?
విచారణకే హాజరు కాకుండా, లీగల్ టీమ్ ద్వారా తన వివరణను పంపిస్తే సరిపోతుందా? అన్న కోణంలోనూ తన న్యాయ నిపుణులతో కేసీఆర్ తెగ చర్చలు చేశారట. అయితే ఆ విషయమై ఇంకా క్లారిటీ రాలేదని తెలిసింది. వస్తే గిస్తే తన హాజరుకు మినహాయింపు వస్తే చాలన్నట్లుగా ప్రయత్నాలు చేస్తున్నారట.
చివరిదాకా గడువు పెంచుతూ పోవచ్చా?
విచారణకు హాజరు కాకుండా ఉండడానికి వీలుగా గడువు తీసుకుంటూ పోవడంపైనా కేసీఆర్ ఆలోచిస్తున్నారట. కమిషన్ గడువు జూలై 31వ తేదీన ముగుస్తుంది. ఆలోగా వాయిదాలు తీసుకుంటూ పోతే? ఈలోగా కమిషన్ గడువు ముగుస్తుంది కాబట్టి, హాజరవాల్సిన అవసరం ఉండదా? అన్న సమీకరణలపైనా న్యాయపరమైన ఆలోచన మాజీ సీఎం చేస్తున్నారట. మొదటి గడువైతే దొరికింది. న్యాయ నిపుణుల సూచన మేరకు మరొకటో, రెండో గడువులు తీసుకుని ఆ తర్వాత ఆలోచించాలని కూడా భావిస్తున్నారట. అధికారంతమున చూడవలె అన్నట్లు. చూడాలి ఏం జరుగుతుందో?
హరీశ్, ఈటల తర్వాతే ఎందుకు?
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు భారీ నీటిపారుదల శాఖా మంత్రి, ప్రస్తుత మల్కాజీగిరి ఎంపీఈటల రాజేందర్ ఆర్థిక మంత్రి. అందుకే 5వ తేదీన కేసీఆర్ ను, 6వ తేదీన హరీశ్ రావును, 9వ తేదీన ఈటల రాజేందర్ ను తమ ఎదుట హాజరు కావాలని కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేస్తున్న జస్టిస్ ఘోష్ కమిషన్ నోటీసులు పంపింది. 5వ తేదీన హాజరు కావాల్సిన కేసీఆర్ 11వ తేదీన హాజరవుతానని టైమ్ తీసుకున్నారు. హరీశ్ రావు, ఈటల మాత్రం తమకు కేటాయించిన తేదీల్లోనే కమిషన్ ఎదుట హాజరవుతామని చెబుతున్నారు. కేసీఆర్ హాజరయ్యే సమయం పొడిగించుకోవడం ఎందున్నది కూడా చర్చనీయాంశమైంది. కమిషన్ ఏయే ప్రశ్నలు వేస్తుంది? ఏయే అంశాలను ప్రాతిపదికగా తీసుకుంది? వాటికి ఏ విధంగా సమాధానం చెప్పాలన్నదానిపై కేసీఆర్ వారి అనుభవాలను తెలుసుకునేందుకే ఈ విధంగా వాయిదా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

