పాలకుర్తి చౌరస్తాలో ఎమ్మెల్యే ఆకస్మిక పరిశీలన
సాయంత్రానికి పనులు ప్రారంభం
జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఎప్పుడూ రద్దీగా ఉండే రాజీవ్ చౌరస్తాలో మండుటెండ తో మిట్ట మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ప్రజలు, వ్యాపారస్తులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉండగా, ఒక్కసారిగా చౌరస్తాలో ఒక వాహనం ఆగింది. అందులో నుండి ఒక సామాన్య మహిళగా కారు దిగారు. దిగి అక్కడే ఉన్న సామాన్యులు, నాయకులతో గత రెండు నెలలుగా ఈ చౌరస్తాలో జరుగుతున్న ప్రమాదాలకు గల కారణాలు, నివారించే ప్రయత్నాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే అక్కడికి ఆర్ అండ్ బి డిఈ ని పిలిచి తీసుకోవాల్సిన చర్యలపై అదేశాలు జారీ చేశారు. చర్యలు తీసుకునే వరకు తగు జాగ్రత్తలు తీసుకోమని అక్కడే ఉన్న సిఐ మహేందర్ రెడ్డి, ఎస్సై దూలం పవన్ కుమార్ లను ఆదేశించారు. ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలతో వాహనాలు నడపాలని అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ ఆకస్మిక పరిశీలనలో ఎమ్మెల్యే వెంట అధికారులు, పోలీసులు, నాయకులు, స్థానికులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సాయంత్రం పనులు ప్రారంభం

మధ్యాహ్నం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి చౌరస్తా ఆకస్మిక పరిశీలనలో అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో, సాయంత్రానికి కొత్త స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు పనులు మొదలుపెట్టారు. ఎమ్మెల్యే చెప్పడం వెంటనే పనులు మొదలు పెట్టడం చూసిన పాలకుర్తి వ్యాపారస్తులు, ప్రజలు గత పాలకులు చెప్పి మరచిపోయేవారని, కానీ ప్రస్తుత ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పట్టు వదలని విక్రమార్కురాలిగా పనిచేస్తుండటంతో హర్షం వ్యక్తం చేశారు.

