కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పుల చిట్టా విప్పుతా….
స్టేషన్ ఘన్పూర్ ప్రజా పాలన సభలో సిఎం రేవంత్ రెడ్డి
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రజా పాలన – ప్రగతి బాట బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి సభా అధ్యక్షత వహించగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, సుమారు 800 కోట్ల నిధులతో చేయనున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. శ్రీరాం సాగర్, నాగార్జున సాగర్, కోయిల్ సాగర్, మంజీరా గడ్డపై సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమన్నారు. గత పదేళ్లలో చేసిన అభివృద్ధిపై, చేయబోయే అభివృద్ధిపై పిల్ల కాకులకేం తెలుసు… వాళ్లు వీళ్లు కాదు కెసీఆర్ నువ్వే రా… చర్చిద్దాం అన్నారు. కేసీఆర్ కు కాంగ్రెస్ దెబ్బ ఎలా ఉంటుందో 2023 లో ప్రజలు చూపించారన్నారు. అధికారం ఉంటే తప్ప కెసీఆర్ ప్రజల్లోకి రాలేరా? అని ప్రశ్నించారు. ఆయన కావాలనే బయటకు రాకుండా కొడుకు అల్లుడిని ఊరు మీదకు వదులుతున్నారు అన్నారు. బయటకు రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు?…జీతభత్యాలు ఎందుకు?…. ఎందుకు అంటూ దుయ్యబట్టారు. క్యాప్సికం పండిస్తే కోట్లు వస్తాయన్న కెసిఆర్.. ఆ టెక్నిక్ ఏమిటో ప్రజలకు చెప్పండి… నీ లక్ష కోట్ల సంపాదన నైపుణ్యం ఏంటో ప్రజలకు చెప్పండన్నారు. వెయ్యి మంది యువకులను నీ ఫామ్ హౌస్ కు పంపిస్తా…. ఆ టెక్నిక్ ఏంటో వారికి నేర్పించండి… అని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు తాటి చెట్టు అంతా మనిషి అంటున్నాడట…కెసీఆర్ అట తెలంగాణ జాతిపిత అట… అని అసలు ఎవరు జాతిపిత? ఎవరికి జాతిపిత? ఈ జాతిపిత మందు వాసన లేకుండా నిద్ర లేస్తాడా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణకు జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ అవుతారు తప్ప… తాగుబోతు ఎట్లా అవుతాడు అని ప్రశ్నించారు. దీనితో లక్ష కోట్లు దోచుకున్నోడు.. తాగుబోతోడు.. తెలంగాణ ప్రజల రక్తం తాగినోడు తెలంగాణ జాతిపిత కాదు.. అని విమర్శించారు.

