కొద్ది రోజుల క్రితం పెద్దవంగర మండలంలో పర్యటిస్తూ…. ప్రజల కోరిక మేరకు అనారోగ్య బాధితులను దవాఖానకు చేర్చి 24 గంటలు వైద్య సేవలు అందించడానికి అవసరమైన 108 అంబులెన్స్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, వైద్య అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం తరుపున నూతన అంబులెన్స్‌ను మంజూరు చేయించారు. దాంతో హామీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ…. ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి ఎమ్మెల్యే ను మేము గెలిపించుకోవడం మా అదృష్టం అని కొనియాడుతున్నారు.
ఇదే విషయమై ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని అడుగు డిజిటల్ మీడియా సంప్రదించగా, ఆమె మాట్లాడుతూ…. నన్ను గెలిపించిన ప్రజల కష్టాలు తీర్చడం నా బాధ్యత అని, వారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనిది అన్నారు. వైద్యానికి సంబంధించి ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ప్రభుత్వం మంజూరు చేసిన తొర్రూరు లో 100 పడకల దవాఖాన, పాలకుర్తిలో 50 పడకల దవాఖాన కు శంకుస్థాపన చేయనున్నాం అన్నారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం అన్నారు.

