2016 నుండి ఐటీ పరిశ్రమలకు సంబంధించి సబ్సిడీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 4500 కోట్లు మొత్తం బకాయిలు ఇంకా చెల్లించబడలేదు. పరిశ్రమలు హైదరాబాద్‌కి పరిమితమయ్యే బదులు, టైర్ 2, 3 నగరాల్లో కూడా విస్తరించాలన్న ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని మంత్రి వివరించారు. భూముల కేటాయింపుల అంశంపై, పరిశ్రమలు సబబుగా స్థాపించకపోతే, టీఎస్ ఐఐసీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
పరిశ్రమల పెట్టుబడులు మరియు యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ సంవత్సరం 500 మందికి, రెండు సంవత్సరాల్లో 2000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. అమెరికన్ కంపెనీలు, డ్రోన్స్ సాఫ్ట్‌వేర్ రంగం లో పనిచేసే కంపెనీలు హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటు చేశాయని తెలిపారు. ద్వితీయ, తృతీయ నగరాల్లో ఐటీ విస్తరించడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.

